చంద్రుని మీద ల్యాండ్ కొన్న గుజరాత్ యువకుడు.. ఎవరి కోసం అంటే?

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన అనుభూతి. దీనిని చాలా అంటే చాలా గ్రాండ్​ గా చేసుకోవాలి అనుకుంటారు. అదే ప్రేమ పెళ్లి అయితే ధూం ధాం చేయాలని అనుకుంటారు. ఇదే క్రమంలో ప్రేమించిన అమ్మాయికి తన వంతుగా గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తారు. ఇప్పుడు ఉన్న యువత అయితే ఆ గిప్టుల కోసం ఎంత ఖర్చు అయినా వెనుకాడడం లేదు. కాబోయే ఫియాన్సీకి సర్​ప్రైజ్ గిఫ్టులివ్వడమే పనిగా ముందుకు సాగుతారు. అలానే ఆ గిప్ట్ లను పెద్ద మొత్తం వెచ్చించి మరీ కొనుగోలు చేస్తారు. అయితే గుజరాత్ లో ఉండే ఓ వ్యక్తి తనకు కాబోయే ఫియాన్సీకి ఇచ్చిన గిప్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతుంది.

VADODARA BUSINESSMAN GIFTS TO HIS FIANCEE LAND ON THE MOON
VADODARA BUSINESSMAN GIFTS TO HIS FIANCEE LAND ON THE MOON

ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు అంటే… ఓ అమ్మాయిని సుమారు రేండేళ్ల నుంచి ప్రేమించాడు. అయితే ఆ మ్మాయి కూడా ఓ కుర్రాడికి ఓకే చెప్పింది . ఇదే సమయంలో వాళ్ల ఇంట్లో వారికి చెప్పగా వారు కూడా వారి పెళ్లికి ఓకే చెప్పారు. ఈ క్రమంలోనే పెళ్లి ఫిక్స్ చేసుకున్న తరువాత ఆ యువకుడు విన్నూత్నంగా ఆలోచించి తన భార్యకు ఏకంగా చంద్రుడి మీద స్థలం కొన్నాడు. ఇందుకు ఆలోచన వచ్చిన వెంటనే ఇంటర్నేషనల్​ లూనార్​ లాండ్​ రిజిస్ట్రి అండ్ యూఎస్​బెస్​డ్​ ఆర్గనైజేషన్​ అధికారులను సంప్రదించి ఇత్యాది వ్యవహారాలు అన్నీ పూర్తి చేశాడు.

అనంతరం ఇందుకు సంబంధించిన దస్తావీజులను తాళి కట్టిన శుభ వేళలో భార్యకు అందించాడు. ఇది చూసిన ఆమె ఆనంద భాష్పాలను కళ్ల నింపుకుని భర్తను హగ్​ చేసుకుంది. ఈ విధంగా ఆ యువకుడు తన ప్రేమను తన భార్యకు చూపించాడు. ఇలాంటి ఆలోచనలు చేసిన వ్యక్తి ఎవరు అనే సందేహం రావచ్చు కదా… ఆ కుర్రాడే గుజరాత్​లోని వడోదరకు చెందిన మయుర్ ​పాటిల్. చంద్రునిపై ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించింది ఆయన భార్య హేమలీ పాటేల్ కోసం. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *