ఈ యాచకురాలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అందరూ షాక్..!

సాధారణంగా ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే చాలామంది భయపడతారు. కొందరికి అర్థమైన సరిగా రిప్లై ఇవ్వాలేరు. మరికొందరు ఎదుటివాళ్లు మాట్లాడుతుంటే ఏం చెప్పాలో తెలియక అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఎంత చదివినా ఇంగ్లీష్ రావడం లేదని మనం చాలాసార్లు అనుకుంటాము. అదే ఒక యాచకురాలు మాట్లాడితే ఆశ్చర్యం కలుగుతుంది కదూ. ప్రస్తుతం అలాంటి ఇన్సిడెంట్స్ వారణాసిలో జరిగింది. రోడ్డుపై తిరుగుతున్న ఓ యాచకురాలు ఇంగ్లీష్ లో మాట్లాడి అందరిని షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

beggar lady speaking english
beggar lady speaking english

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు స్వాతి. వారణాసి వీధుల్లో యాచకురాలుగా ఉంటుంది. అటుగా వెళ్తున్న అవినాస్ త్రిపాఠి అనే వ్యక్తి.. ఆమెతో ఇంగ్లీష్ మాట్లాడాడు. ఆమె అదే రీతిలో రిప్లై ఇవ్వడంతో షాక్ తిన్నాడు. దీంతో ఆ యాచకురాలు వీడియో చూసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇంతకి ఆ వీడియో ఏం చెప్పిందో వింటే మీరు షాక్ కు గురవుతారు.

తాను బిడ్డాకు జన్మనిచ్చిన ఆనంతరం శరీరంలోని కుడి భాగం పక్షవాతానికి గురైంది. దక్షిణ భారతదేశం నుంచి వారణాసి వచ్చి మూడేళ్లు పూర్తి అయ్యిందని చెప్పింది. తాను కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నానని ఎవరైనా జాబ్ ఇస్తే.. చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సోషల్ మీడియా ద్వారా వేడుకుంది. ప్రసుత్తం ఈ వీడియో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు తమ అభిప్రాయాలను కాంమెట్ల రూపంలో పోస్టు చేస్తున్నారు. మరీ ఈ వీడియో చూస్తుంటే మీకు ఏం అనిపిస్తుందో చెప్పండి..

Add a Comment

Your email address will not be published. Required fields are marked *