‘నాని’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరో అయ్యాడని మీకు తెలుసా?

Ashok Galla: సిని ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలుగా వెలుగుతున్నారు. ఈ మధ్య చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా పరిచయమయ్యారు.
‘చిరుత’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన ప్రత్యేక యాటిట్యూడ్ తో రామ్ చరణ్ ని కనబరిచిన పూరి జగన్నాథ్ వారసుడు ఆకాష్ పూరి.. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమాలో చిన్ననాటి చిరుగా కత్తి పట్టుకుని ఓ రేంజ్ లో హడావిడి చేసినా తేజ సజ్జ వంటి ఎందరో పలు చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు హీరోలుగా వెలుగుతున్నారు.

Ashok Galla
Ashok Galla

అదే తరుణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘నాని’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఓ బుడతడు ఇప్పుడు కుర్ర హీరోగా మారాడు. తెలుగు ఫాంటసీ కామెడీ చలనచిత్ర మైన నాని సినిమాకి ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించాడు. కాగా మహేష్ బాబు సరసన అమీషా పటేల్ నటించింది.

ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ ఓ రేంజ్ లో తన సంగీతాన్ని అందించినప్పటికీ.. ఈ చిత్రం పరాజయం పాలు అవడం తప్ప లేదు. ఇక ఈ సినిమాలో హీరో నాని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ బుడతడు హడావుడి చేశాడు. ఇంతకు ఆ బుడతడు ఎవరో మీకు ఇంకా అర్థం కాలేదా.. ఈ పొంగల్ కి ‘ హీరో ‘ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మహేష్ బాబు బావ అయినటువంటి గల్లా జయదేవ్ వారసుడు అశోక్ గల్లా. మొదటి చిత్రంతోనే అందాల భామ నిధి అగర్వాల్ జతకట్టాడు. ఈ సినిమా ప్రమోషన్ ల భాగంలో ఈ కుర్ర హీరో తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నాని సినిమా గురించి కొన్ని విషయాలు కూడా తెలిపాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *