బిగ్‌ బాస్‌: ముమైత్‌ ఖాన్ రీఎంట్రీ.. ప్రోమో రిలీజ్..!

వినోదానికి లేదు ఫుల్‌స్టాప్‌ అంటూ బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ 24 గంటలు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే నలుగురు ఎలిమినేట్‌ అయ్యారు. అందులో ముమైత్‌, శ్రీరాపాక, చైతూ, సరయు ఉన్నారు. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్.. ఊహించని విధంగా మొదటివారమే ఎలిమినేట్ అయిపోయింది. అయితే ముమైత్‌కి మరో అవకాశం దక్కింది. తాజాగా హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ప్రోమో రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

bigg boss ott telugu mumaith khans re entry

ఇందులో అఖిల్‌.. బిందుమాధవి గురించి మాట్లాడటంతో హర్ట్‌ అయినట్లుంది అషూ. ఇక హౌస్‌లో ఓ టాస్క్‌ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. భార్యాభర్తలకు మధ్య జరిగిన గొడవను పరిష్కరించేందుకు కోర్టు సీన్‌ను ఏర్పాటు చేయగా.. ఇందులో శివ లాయర్‌గా వాదిస్తున్న సమయంలో సడన్‌గా ముమైత్‌ రీఎంట్రీ ఇచ్చింది. ఆమె రాకతో హౌస్‌మేట్స్‌ సర్‌ప్రైజ్‌ అయ్యారు. వచ్చీరాగానే జడ్జి స్థానంలో కూర్చున్న ముమైత్‌ విడాకుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది. అఖిల్‌, బిందుమాధవిలకు ముమైత్‌ విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఇక సీజన్ 1లో కూడా ముమైత్ ఖాన్ ఇలానే రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు కూడా ముమైత్ ఖాన్ హౌస్ మేట్స్ గేమ్‌ని బాగా పరిశీలించి మరోసారి రీఎంట్రీ ఇచ్చి ఉంటుందని అర్ధమవుతోంది. ముమైత్ గనుక హౌస్‌లో కంటిన్యూ అయితే ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారే అవకాశం కనిపిస్తుంది.

ఇక ప్రస్తుతం హౌస్‌లో నామినేషన్‌కి సంబంధించి ఓ టాస్క్ నడుస్తోంది. నిజానికి సోమవారం నాడు జరిగిన నామినేషన్ ప్రక్రియలో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. మంగళవారం నాడు ఈ నామినేషన్ లో ఉండేవారు సేవ్ అవ్వడానికి ఓ ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. అలానే వారికి బదులు మరొకరు నామినేట్ అవ్వాల్సి వస్తుంది. అలా ఈసారి తేజస్వి, స్రవంతి నామినేషన్స్ లోకి వచ్చారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *