నయన్‌తార, విఘ్నేశ్‌ల రహస్య వివాహం?.. వీడియో వైరల్..!

సెలెబ్రిటీస్‌ సీక్రెట్‌గా డేటింగ్ చేయ‌డం, క‌లిసి ట్రిప్స్‌కు వెళ్ల‌డం వంటివి త‌రచు చూస్తూనే ఉంటాం. ఇప్ప‌టికే సౌత్ టూ నార్త్ వ‌ర‌కు ప‌లువురు సెల‌బ్రిటీలు సీక్రెట్‌గా డేటింగ్ చేసిన‌, ట్రిప్స్‌కు వెళ్ళిన ఫోటోలు లీక్ అవ్వ‌డం వంటివి జ‌రిగాయి. ఈ మధ్య కాలంలో కూడా ఓ జంట ఇలానే త‌మ రిలేష‌న్‌ను ర‌హస్యంగా మెయింటేన్ చేస్తూ చ‌ట్టాప‌ట్టాలేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లు మ‌రెవ‌రో కాదు లేడి సూప‌ర్‌స్టార్ న‌య‌న్‌తార‌, ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్.

actress nayanthara vignesh shivan secret marriage?

తమిళ చిత్ర పరిశ్రమలో లవ్లీ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌. ఎన్నో ఏళ్ల నుంచి ఈ జంట ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు.. మీ పెళ్లి ఎప్పుడు..? అంటూ సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాది ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నయన్‌.. కుటుంబసభ్యుల సమక్షంలో విఘ్నేశ్‌తో తన నిశ్చితార్థమైపోయిందని, తన వేలికి ఉన్నది ఎంగేజ్‌మెంట్‌ రింగేనని, సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటామని చెప్పుకొచ్చారు.

https://www.instagram.com/reel/Ca_cZtcAFC2/?utm_source=ig_embed&ig_rid=18a9cadb-94cb-46c6-8573-403f01a31088

వీళ్ళిద్ద‌రూ నిశ్చితార్థంలాగే పెళ్ళికూడా సీక్రెట్‌గా చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. తాజాగా వీళ్ళిద్ద‌రూ క‌లిసి త‌మిళ‌నాడులోని ఓ ఆల‌యానికి వెళ్ళారు. ఇద్దరూ కలసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయ సిబ్బందితో ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకొచ్చాయి. అయితే ఆ వీడియోలో న‌య‌న్‌తార‌ నుదిటిపైన కుంకుమ పెట్టుకుని ఉంది. దాంతో వీళ్లిద్ద‌రి సీక్రెట్ మ్యారెజ్ జరిగిపోయిందంటూ నెటిజన్లు వరుస కామెంట్స్‌ పెడుతున్నారు. ఇక ఈ ఫోటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *