‘ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా’ అంటూ నటిపై దారుణమైన ట్రోల్స్‌..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ ‘మలైకా అరోరా’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 48 ఏళ్ల వయస్సులోనూ యువ హీరోయిన్లకు ధీటుగా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ వయసులోనూ అడపాదడపా ఐటమ్ సాంగ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఆమె వేసుకునే డ్రెస్సులు, తీసుకునే నిర్ణయాలు కూడా ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. తన కంటే చిన్న వయసు హీరో అర్జున్ కపూర్‌తో ఆమె సహజీవనం చేస్తుండడం ఇప్పటికే చాలా కాంట్రవర్సీ అయింది.

తాజాగా ఆమె వేసుకున్న డ్రెస్ మళ్లీ తీవ్ర విమర్శల పాలైంది. తాజాగా మలైకా అరోరా ముంబైలోని ఖర్ ప్రాంతానికి వచ్చారు. బ్రౌన్ ఫుల్ ఓవర్‌తో కూడిన పొట్టి చొక్కా మాత్రమే వేసుకుని రోడ్డుపై ఆగి ఉన్న తన కారు దగరికి నడుచుకుంటూ వచ్చారు. అక్కడ ఫొటోలకు పోజులిచ్చి కారు ఎక్కి వెళ్లిపోయాయిరు. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు మలైకా అందాలను ఆస్వాదిస్తుంటే.. మరొకొందరు మాత్రం ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. ‘మలైకా.. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా?’, ‘అయ్యోరామ.. ఇదేం ఫ్యాషన్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు మాత్రం ‘ఎవరి డ్రెస్ వారిష్టం,విమర్శించే హక్కు ఎవరికీ లేదు ’ అంటూ మద్దతుగా నిలిచారు. ఏదేమైనా మలైకా ఫ్యాషన్ ఐకాన్‌కు ఉదాహరణలా ఉంటుంది. ఎన్నిసార్లు ట్రోలింగ్ బారిన పడిన ఆమె చలించదు.

సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే వ్యక్తి మలైకా. యోగా సాధకురాలు. ఎప్పటికప్పుడు తన ఫోటోలను, యోగాసనాలను, వ్యక్తిగత విషయాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న మలైకా దాదాపు 18 ఏళ్ల తరువాత విడాకులు ఇచ్చింది. వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో కలిసుంటోంది. తెలుగులో అతిధి, గబ్బర్ సింగ్ సినిమాల్లో ఐటెం సాంగ్‌లలో నటించింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *