నా తండ్రికి ఇల్లు కట్టిస్తున్న: యాంకర్ లాస్య
యాంకర్ లాస్య.. ఈ పేరు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి. పదేళ్ల క్రితమే సంథింగ్ స్పెషల్ గా పరిచయమై.. ఆ ప్రత్యేకతను మరో ఐదేళ్లు అలానే కొనసాగించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. తన ప్రత్యేక వాయిస్ తో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో తానో స్పెషల్ అని ప్రూవ్ చేసుకుంది.
పెళ్లి తర్వాత కొంతకాలం బుల్లితెరకు దూరమైనప్పటికీ.. బిగ్ బాస్ లో అడుగుపెట్టి మరోసారి బుల్లితెర ప్రేక్షకులను పలకరించింది. ఇక లాస్య ఈ మద్యనే టీవీ షోలలో బిజీగా మారింది. అలాగే కుదిరినప్పుడల్లా యూట్యూబ్ వీడియోలతో హడావిడి చేస్తోంది. ఇక తాజాగా ఆమె తండ్రికి కొత్త ఇల్లు కట్టిస్తుంది.
ఈ విషయాన్ని తన అభిమానులకు తెలియజేసింది. ఈ క్రమంలో ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ‘నేను చిన్నప్పుడు ఉన్న ఇంటిని ఈమధ్యే కూలగొట్టాం కదా.. దాని ప్లేస్ లో కొత్త ఇంటిని నిర్మిస్తున్నాం. ఇప్పటికే అది చాలా వరకు పూర్తయింది’. అంటూ తన ఫ్యాన్స్ కి ఇల్లును చూపించింది. మా నాన్న కళ్ళల్లో సంతోషాన్ని చూడడానికి నేను ఏదైనా చేస్తాను.
ఆయన సంతోషం చూస్తుంటే నాకు కడుపు నిండిపోతుంది. ఆయనంటే ఇష్టంతో ఇల్లు కట్టిస్తున్న అంటూ.. ఇంటిలో రూమ్స్ అన్నీ చూపించింది. అలాగే గృహ ప్రవేశం చేసే ముందు తప్పకుండా ఇల్లు మొత్తాన్ని చూపిస్తా అని చెప్పుకొచ్చింది లాస్య. అలానే తన తండ్రికి ట్రాక్టర్ ను గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలిపింది. అంతేకాకుండా వాళ్ల నాన్నతో టాక్టర్ పైన కాసేపు ఎక్కి తిరిగింది.