తెలుగు రాష్ట్రాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ హంగామా..!

తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సందడి నెలకొంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఏపీ, తెలంగాణల్లోని థియేటర్ల వద్ద అభిమానులు కేరింతలు కొడుతున్నారు. పెద్ద ఎత్తున ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ బ్యానర్లు కట్టడంతో పాటు తమ అభిమాన హీరోల కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు. పలు చోట్ల బాణసంచా కాలుస్తూ సందడిగా గడుపుతున్నారు. అటు సోషల్‌ మీడియాలోనూ RRR హవా నడుస్తోంది. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్స్టాగ్రామ్‌, వాట్సాప్‌ అని లేకుండా అన్ని చోట్లా RRR సినిమా వీడియోలు, ఫోటోలతో అభిమానులు హోరెత్తిస్తున్నారు.

Fans celebrations at RRR theaters

హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, అనంతపురం తదితర నగరాల్లో థియేటర్ల వద్ద పండగ వాతావరణ కనిపిస్తోంది. విశాఖలోని సంగం శరత్‌ థియేటర్‌ వద్ద అభిమానులు వెయ్యి కొబ్బరికాయలు కొట్టారు. ఇక విజయవాడ థియేటర్‌లో సినిమా మధ్యలో సాంకేతిక సమస్య తలెత్తడంతో కొద్దిసేపు మూవీ నిలిచిపోయింది. దీంతో ఆగ్రహించిన అభిమానులు థియేటర్‌ అద్దాలు ధ్వంసం చేసి రచ్చ చేశారు.

https://twitter.com/TeamRC_Suryapet/status/1507212817317113858?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1507212817317113858%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-40442120931286720222.ampproject.net%2F2203101844000%2Fframe.html

https://twitter.com/MB143PAWAN/status/1507036837390430209?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1507036837390430209%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-40442120931286720222.ampproject.net%2F2203101844000%2Fframe.html

ఇక మన సెలబ్రిటీలు సైతం థియేటర్స్‌కి వెళ్లి బెనిఫిట్ షో చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ టీం కూడా థియేటర్లలో ఫ్యామిలీ, అభిమానులతో కలిసి సినిమా చూశారు. ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి AMB సినిమాస్ లో బెనిఫిట్ షో చూడగా రాజమౌళి, రామ్ చరణ్ భ్రమరాంబ థియేటర్లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశారు. రామ్ చరణ్‌తో పాటు భార్య ఉపాసన, మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా థియేటర్‌కి వచ్చారు. ఇక థియేటర్లో సినిమా చూస్తూ అభిమానులతో పాటు ఉపాసన కూడా స్క్రీన్ పై రామ్ చరణ్ సన్నివేశాలు వచ్చినప్పుడు పేపర్లు ఎగురవేస్తూ హంగామా చేసింది. సినిమా చూస్తూ ఫ్యాన్ గర్ల్ లాగా అరుస్తూ, పేపర్లు చింపుతూ, వాటిని గాల్లోకి ఎగరేస్తూ రచ్చ చేసింది ఉపాసన. ఇక కొన్ని పేపర్లు వెనకాల కూర్చున్న చరణ్ పై కూడా విసురుతూ హడావిడి చేసింది. కొంతమంది ఉపాసన పేపర్లు విసురుతూ చేసిన రచ్చని వీడియోలు తీయగా ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://twitter.com/telugufilmnagar/status/1507174678863151108?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1507174678863151108%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fwww.tv5news.in%2Fcinema%2Fupasana-konidela-throws-papers-in-theatre-after-seeing-ram-charan-809763

Add a Comment

Your email address will not be published. Required fields are marked *