వాళ్ళు అలాంటి వారే అని షణ్ముఖ్ – సిరి లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన… బిగ్ బాస్ విన్నర్ సన్నీ
బుల్లితెరపై టీఆర్పీ లను పరుగులు పెట్టించిన బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ముగిసింది. ఈ సీజన్ లో విజేతగా వీజే సన్ని నిలిచాడు. మొదటి నుంచి కోపం ఎక్కువ అంటూ చివరి వరకు నెగిటివిటిని మోస్తూ వచ్చిన సన్నీ చివరకు తెలుగు రాష్ట్ర ప్రజల మనసులను దొచుకుని బిగ్‌బాస్ సీజన్ 5 విజేతగా అయ్యాడు. ఎంటర్ టైనర్ అనే పేరు సంపాందించుకున్న సన్నీ… మచ్చా మచ్చా అంటూనే యూత్‌ను ఆకట్టుకున్నాడు. మొత్తానికి ఖమ్మం కుర్రాడు బిగ్‌బాస్ సీజన్ 5 ట్రోఫీ అందుకున్నాడు. గెలిచిన తర్వాత సన్నీ స్జేజ్ పై ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు సన్నీ.
ఇక్కడ మాట్లాడినా నామినేషన్లో మాట్లాడినట్లే ఉంది సార్ అంటూ కామెడీ చేశాడు. అనంతరం తనను గెలిపించినందుకు 19 మంది కంటెస్టెంట్స్‌కు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు సన్నీ. ఏ సీజన్లో లేనిది ఈ సీజన్ లో ప్రామిస్ చేసుకున్నాం. ఎంత కొట్టుకున్నా, మరునాడే కలిసిపోయాం… నాగ్ సార్ ఐ లవ్యూ సార్ అంటూ తన సంతోషాన్ని తెలియజేశాడు. దీంతో తిరిగి నాగార్జున ఐలవ్యూ అనగానే సిరికి చెప్పండి సర్ అనగానే సిరికి ఐ లవ్యూ అని చెప్పేసాడు. ఈ స్థాయిలో నిలబడటానికి ప్రేక్షకులు, స్నేహితులు ప్రతిక్షణం నాగార్జున సార్ మోటివేషన్ కారణమని కప్పు ముఖ్యం బిగులూ అనేలా చేసింది మా కళావతి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత షణ్ముఖ్ గురించి ఒక క్లారిటీ ఇస్తాను సార్… ఈ స్టేజ్ మీదే మాట్లాడాలి ఇది అంటూ షణ్ముఖ్, సిరి రిలేషన్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. షణ్ముఖ్ అండ్ సిరి. అలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం అదృష్టం… నాకు మానస్‌కి ఎలాంటి స్నేహమైతే ఉందో అదే స్నేహం వాళ్లిద్దరి మధ్య ఉంది అని చెప్పుకొచ్చాడు. దాంతో షణ్ముఖ్ సన్నీకి హగ్ ఇచ్చాడు. దీంతో వారి మద్య కూడా స్నేహమే ఉందని చెప్పే ప్రయత్నం చేశాడు సన్నీ.