లాస్ట్ డే కి వచ్చేసిన బిగ్ బాస్ సీజన్ 5 … గెస్ట్ లుగా రానున్నది ఎవరంటే ?

బుల్లితెరపై ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తూ సందడి చేస్తున్న షో  బిగ్ బాస్. కాగా  సీజన్ 5 గా 19 మందితో ప్రారంభమయిన ఈ సీజన్  ముగింపు దశకు వచ్చేసింది. నేటితో బిగ్ బాస్ సీజన్ 5 ముగుస్తుంది. ఇక హౌస్ లో ఉన్న ఐదుగురిలో ఒకరు విజేత కానున్నారు. సిరి, షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్, మానస్ ఈ ఐదుగురిలో ముందుగా ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు. ఇక మిగిలిన ముగ్గురిలో ఒకరు విన్నర్ అవుతారు. ఎవరు బిగ్ బాస్ ట్రోఫీని అందుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

guest list for bigg boss season 5 telugu

నేటి ఎపిసోడ్ గ్రాండ్ గా నిర్వహనించనున్నారు. ఈ ఫైనల్ కోసం పెద్ద పెద్ద స్టార్స్ ను స్టేజ్ పై తీసుకు రానున్నాడు నాగార్జున. ఈ ఫైనల్ లో దర్శక ధీరుడు రాజమౌళి ఎంట్రీ ఇవ్వనున్నారు. వీరితో పాటు బాలీవుడ్ స్టార్స్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ కూడా సందడి చేయనున్నారు. అలాగే శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ లో భాగంగా నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి పాల్గొనబోతున్నారు.  ఇక పుష్ప మూవీకి సంబంధించి రష్మిక, దేవీశ్రీ ప్రసాద్, సుకుమార్ పాల్గొననున్నారు. ఇక జగపతిబాబు, నవీన్ చంద్ర గెస్టులుగా రానున్నారు. వీరితోపాటు స్టార్ హీరోయిన్ శ్రీయ తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకోనున్నారు.

అలాగే అలాగే బాలీవుడ్ బ్యూటీ అలియా బాలయ్య డైలాగ్ చెప్పి అదరగొట్టింది. పుష్పలో ఈ పాటలో సమంత వేడెక్కించే స్టెప్పులు వేసిన ఉ అంటావా ఊఉ అంటావా పాటకు డింపుల్ హయతి స్టెప్పులేసింది. మొత్తానికి గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా ఉండబోతుందని ప్రోమోతో చెప్పేసారు. కాగా సన్నీ నే విజేత అవుతాడని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *