సర్కారు వారి పాట నుంచి “పెన్నీ” సాంగ్ చూశారా?

టాలీవుడ్‌ స్టార్‌ హీరో.. ప్రిన్స్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. ఈ సినిమాకు టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి జంటగా మహానటి కీర్తిసురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పోస్టర్స్ విడుదల కాగా.. అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నిజానికి ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వేసవికి వాయిదా వేశారు. మే 12న సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఇక తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా సెకండ్‌ సింగిల్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. “పెన్ని” అంటూ సాగే.. ఈ పాటలో మహేష్‌ కూతురు సితారా సూపర్‌ డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చింది. అటు మహేష్‌ బాబు కూడా ఈ సాంగ్‌లో చాలా క్యూట్‌గా కనిపించాడు. ఇక పాటలో తండ్రీకూతుళ్ల స్టెప్స్‌కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఈ సాంగ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ అనే చెప్పాలి.

ఈ వీడియోని షేర్‌ చేసిన మహేశ్‌.. ‘‘పెన్నీ పాట నాకెంతో స్పెషల్. నా రాక్‌స్టార్‌ని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు. బ్యాంక్‌ కుంభకోణం వంటి విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేశ్‌బాబు మరింత యంగ్‌ లుక్‌లో కనిపించనున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *