సాయి పల్లవి అరుదైన ఘనత.. మరో గోల్డ్‌ మెడల్ సొంతం!

కొందరు కథానాయికలు ఏళ్ల తరబడి ప్రయత్నింనా.. తమచిదైన ముద్ర వేయలేక తంటాలు పడుతూనే ఉంటారు. పెద్ద పెద్ద సినిమాలు చేసినా సరే, వారికంటూ ఒక గుర్తింపు అంత త్వరగా దొరకదు. కానీ.. సాయి పల్లవి మాత్రం మొదటి సినిమా నుంచే అందరి మనసులు దోచుకోవడం మొదలుపెట్టింది. ట్యాలెంట్ ఉంటే అందంతో పని లేదని ఈ నేచురల్ బ్యూటీ నిరూపించింది. అందరిలా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు చేయకుండా ప్రాధాన్యం ఉన్న పాత్రల్ని మాత్రమే ఒప్పుకుంది. స్టార్స్‌తో నటించే అవకాశం వచ్చినా, పాత్రకు ప్రాధాన్యంనకు లేకపోతే తిరస్కరించింది.

Sai Pallavi hits hattrick with gold medals

ఇండస్ట్రీకి వచ్చిన ఆనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన సాయి పల్లవి.. అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అంతేకాదు తన డ్యాన్స్‌తో ఎంతోమందిని మెస్మరైజ్‌ చేస్తోంది ఈ నాచులర్‌ బ్యూటీ. ఫిదా మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత తెలుగులో వరుస విజయాలు అందుకుంటూ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారింది. చివరిగా శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రంతో అలరించిన ఆమె అరుదైన రికార్డు సాధించింది. 

ఈ సినిమాలో ఆమె పోషించిన దేవదాసి పాత్రకుగానూ గోల్డ్‌ మెడల్‌ అందుకోనుంది. ఈ ఏడాది బిహైండ్‌ వుడ్స్‌ అవార్డ్స్‌ వేడుకలో సాయి పల్లవి బంగారు పతకం సొంతం చేసుకుంది. కాగా ఇప్పటికే సాయి పల్లవి రెండు గోల్డ్‌ మెడల్స్‌ అందుకుంది. 2017లో ఆమె నటించిన కాళి సినిమాకు గానూ తొలిసారి గోల్డ్‌ మెడల్‌ అందుకోగా 2019లో మలయాళంలో ఫహాద్‌ ఫాజిల్‌ చేసిన అథిరిన్‌ సినిమాకి గానూ రెండోసారి గోల్డ్‌ మెడల్‌ తీసుకుంది. ఇప్పుడు తాజాగా శ్యామ్‌ సింగరాయ్‌ మూవీకి మూడోసారి గోల్డ్‌ మెడల్‌ తీసుకొవడం విశేషం. ఇక సాయి పల్లవి ఇటీవల తెలుగులో రానా సరసన నటించిన విరాట పర్వం జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *