అదిరిపోయిన రవితేజ కొత్త సినిమా టీజర్… చూశారా?

టాలీవుడ్‌ మాస్‌ హీరో రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ”. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.

యాక్షన్‌ సన్నివేశంతో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘‘ఆయుధం మీద ఆధారపడే నీలాంటివాడి ధైర్యం వాడే ఆయుధంలో ఉంటుంది. ఆయుధంలా బతికే నాలాంటివాడి ధైర్యం అణువణునా ఉంటుంది’’ అంటూ ర‌వితేజ మార్క్ సంభాష‌ణలు అభిమానుల్లో ఫుల్ జోష్ నింపేలా ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వాధికారిగా కనిపించనున్నారు. ఆయన సరసన దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ సందడి చేయనున్నారు. తనికెళ్ల భరణి, వీకే నరేష్, రాహుల్ రామకృష్ణ, వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.

Raviteja Ramarao On Duty Movie Teaser

రవితేజ ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా ఆయన దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రానికి రావ‌ణాసుర టైటిల్‌ను ఫైన‌ల్ చేశారు. ఈ సినిమాలో ర‌వితేజ లుక్ ఇప్ప‌టికే విడుద‌ల‌వ్వగా తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్తి అయ్యినట్లు చిత్రబృందం ప్రకటించింది.  ఇక ఈ చిత్రంలో హీరో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న గ్రాండ్‌గా విడుదలకానుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *