స్టేజ్‌పై డ్యాన్స్‌ వేయడం గురించి మహేశ్‌బాబు ఏమన్నారంటే..!

మహేశ్ బాబు – పరశురామ్ కాంబినేషన్లో నిర్మితమైన ‘సర్కారువారి పాట’ 200 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ అభిమానులతో ఇంటరాక్షన్‌ను నిర్వహించింది. మహేశ్ బాబు, కీర్తి సురేశ్, పరశురామ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొని అభిమానూలు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చారు. కర్నూలులో జరిగిన విజయోత్సవ సభ గురించి మాట్లాడారు. ఆ రోజు స్టేజ్‌పై డ్యాన్స్‌ చేయడంపై పెదవివిప్పారు.

Mahesh babu fun interaction with fans

మహేశ్ బాబు మాట్లాడుతూ .. “ఈ సినిమా షూటింగు సమయంలో జరిగిన ఒక సంఘటనను మీకు చెప్పాలి. ఒక సీన్లో నా ముఖంపై తిట్టమని కీర్తి సురేశ్ తో పరశురామ్ చెప్పాడు. మీ ముఖం చూస్తూ తిట్టడం నా వల్ల కాదు బాబోయ్ అనేసింది. మిమ్మల్ని తిడితే మీ ఫ్యాన్స్ ఊరుకోరు అంటూ భయపడిపోయింది. నా ఫ్యాన్స్ ఏమీ అనరు .. ఇలాంటి సీన్స్ ను వాళ్లు ఎంజాయ్ చేస్తారు. పర్వాలేదు చేసేయండి అన్నాను. అంతగా అడిగితే గానీ ఆమె నన్ను తిట్టలేదు .. ఆ సీన్ చిన్నపాటి స్ట్రీట్ ఫైట్ లా ఉండాలని పరశురామ్ చెప్పాడు. ఇప్పుడు ఆ సీన్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది” అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే కర్నూల్‌లో స్టేజ్‌పై డ్యాన్స్‌ వేయటం గురించి ఏమన్నారంటే.. “అది ఎందుకు అలా జరిగిందో నాక్కూడా తెలియదు. అసలు ఏం జరుగుతుందో తెలియక మా టీమ్‌ మొత్తం షాక్‌, సర్‌ప్రైజ్‌లో ఉండిపోయింది. రెండేళ్లు కష్టపడి సినిమా చేశాం. దానికి అభిమానుల నుంచి వస్తోన్న ఆదరణ చూశాక.. స్టేజ్‌పైకి ఎక్కి డ్యాన్స్‌ చేయాలనిపించింది. అలా, చేసేశా’’ అంటూ చెప్పుకొచ్చారు మహేశ్. ఇక తాను ఇప్పటివరకు టాటూలు వేయించుకోవేదని భవిష్యత్‌లో కూడా ఆ ఆలోచన లేదని చెప్పారు. అది చాలా నొప్పితో కూడిన వ్యవహారం అని అన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *