చలికాలంలో స్వెటర్ వేసుకోలేపోతున్నారా అయితే మీ అభిమాన హీరోలను ఫాలో అవ్వండి వెచ్చదనంతో స్టైల్ గా ఉండండి!

Heroes: గజగజ వణికించే చలి నుంచి కాపాడుకోవడానికి స్వెటర్లు, హ్యాండ్ గ్లౌసులు, బూట్లు, టోపీలు, సాక్సులు ధరిస్తుంటారు. అయితే ఈ మధ్య హీరోలు తమ వింటర్ ఫ్యాషన్ దుస్తులతో (Winter fashion dress) న్యూ లుక్ (New look) లో అభిమానుల మనసులు దోచుకుంటున్నారు. అయితే వీటిని మీరు కూడా ట్రై చేసి కొత్త లుక్ తో కూల్ గా కనిపించండి..

Heroes
Heroes

చలికాలంలో చలి (Cold) నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి (To protect the body) చలిమంటలు వేసుకుని చలి కాచుకోవడం చేస్తుంటారు. అయితే వెన్ను వణికించే చలి నుంచి కాపాడుకోవడానికి వేసుకునే దుస్తుల పై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. అయితే చలికాలంలో ఉన్నితో తయారు చేసిన దుస్తులను వేసుకోవడం మామూలే.

చలికాలంలో వేసుకునే దుస్తులలో రొటీన్గా కనబడకుండా దాని కన్నా విభిన్నంగా మరింత ట్రెండీగా (Trendy) ఉండాలంటే మీ అభిమాన హీరోల వింటర్ ట్రెండీ స్టైలిష్ లుక్ (Stylish look) లను మీరు ట్రై చేయండి. మీరు కూల్ గా హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. ఇలా స్టైలిష్ లుక్ తోనూ చలికాలాన్ని హాయిగా గడిపేయవచ్చు.

నాగ చైతన్య: నాగార్జున తనయుడు అయిన నాగ చైతన్య (Naga Chaitanya) తండ్రి వారసత్వ బాటలో నడుస్తూ కొత్త ఫ్యాషన్ డ్రస్సులతో స్టైలిష్ (Stylish) గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. అయితే ఈ మధ్య నాగచైతన్య రెడ్ కలర్ జిప్పర్ స్వెటర్ షర్ట్ విత్ క్యాప్ తో చాలా స్టైలిష్ గా హుందాగా కనిపించి అభిమానుల మనసును దోచుకున్నాడు. ఈ ట్రెండీ లుక్ ను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

విజయదేవరకొండ: విజయదేవరకొండ (Vijayadevarakonda) ఎప్పటికప్పుడు కొత్త ట్రెండీ లుక్స్ ను ట్రై చేస్తూ స్టైలిష్ గా కనిపిస్తుంటాడు. అయితే తను వింటర్ దుస్తులు, పింక్ కలర్ వింటర్ క్యాప్ (Pink color winter cap) పెట్టుకొని దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి అలందరినీ ఆశ్చర్యపరిచారు. పింక్ అంటే అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా నచ్చుతుందని తనకు ఇష్టమైన కలర్ గురించి అభిమానులకు తెలియజేశారు.

దుల్కర్ సల్మాన్: దుల్కర్ సల్మాన్ (Dulkar Salman) నాన్-ఫ్రిల్స్ క్యాప్, వింటర్ బాంబర్ జాకెట్ లుక్ తో దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వింటర్ డ్రెస్ (Winter Dress Up) లో దుల్కర్ సల్మాన్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. తను వేసుకున్న డ్రస్సు ఎంతటి చలిలోనైనా శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. మీరు కూడా ఉత్తరాది ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి చలి తీవ్రతను తట్టుకోవడానికి ఇలాంటి డ్రెస్ ను ధరించడం మంచిది.

అల్లు శిరీష్: అల్లు శిరీష్ (Allu Sirish) కొత్త జంటతో మంచి హిట్ పొంది ఈ మధ్య కాస్త సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యాషన్ వైపు కాస్త ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. అతను ఈ మధ్య సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటోలో నేవీ కలర్, స్వెడ్ యాంకిల్ షూతో కొత్త లుక్ తో కనిపిస్తూ హ్యాండ్సమ్ (Handsome) గా కనిపించాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *