RRR Movie: ఇండియన్ ఫిల్మ్ హిస్టరి లో ఫస్ట్ టైమ్ ఆ ఘనత సాధించిన “ఆర్‌ఆర్‌ఆర్” మూవీ …

RRR Movie: అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. మెగాపవర్​స్టార్ రామ్​చరణ్​, జూనియర్​ ఎన్టీఆర్​ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో డి‌వి‌వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ క్రమంలోనే వరుసగా పోస్టర్లు, పాటలు విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్​. ఈ సినిమాలో తారక్​, చెర్రీలు మునుపెన్నడూ కనిపించని విభన్న పాత్రల్లో నటిస్టుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ క్యూరియాసిటీ పెరిగిపోయింది. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్​ ఒక్కొక్కరికి రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. యాక్షన్స్​, ఎమోషన్స్​, ఎలివేషన్స్​ ఇలా అన్నింట్లో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది ట్రైలర్​.

rrr movie trailer creating sensational records in youtube

అయితే, తాజాగా ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్ అన్ని రికార్డులను బద్దలుకొట్టింది. విడుదలైన ఆరు రోజుల్లో 100 మిలియన్లకు పైగా వ్యూస్​ సొంతం చేసుకున్న తొలి ట్రైలర్​గా చరిత్రను తిరగరాసింది. అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్లు దాటేసింది ఆర్ఆర్ఆర్​ ట్రైలర్​. ఈ క్రమంలోనే భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా ఆర్​ఆర్​ఆర్ నిలిచింది. విడుదలకు ముందే రికార్డుల వేట ప్రారంభించిన ఈ సినిమా… ఇక థియేటర్లలోకి వస్తే ఎలా ఉంటుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్‌.. దుమ్ము లేపబోతుండగా… ఒలివియా మోరీస్, అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్​దేవగణ్​, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *