నా పెళ్ళికి నన్ను పిలవండి.. నెటిజన్లకు కౌంటర్ ఇచ్చిన హిమజ!

Himaja: టాలీవుడ్ ప్రేక్షకులకు యాక్టర్ హిమజ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బుల్లి తెర నుండి వెండితెరకు పరిచయం అయిన ఈభామ బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన నటనతో ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సహయ నటిగా ఓ వెలుగు వెలుగుతుంది.

ఇక ఈ భామ సోషల్ మీడియా ఇన్ స్టా లో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య సోషల్ మీడియాలో హిమజ తన భర్తకు డివోర్స్ ఇస్తుందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇది తెలిసిన హిమజ తాజాగా ఓ వీడియో ద్వారా రియాక్ట్ అయ్యింది. ఆమెపై వస్తున్న రూమర్స్ పై విరుచుకు పడింది.

“ఈమధ్య ఏమిటో అర్థం కావట్లేదు. మనుషులతో సంబంధం లేకుండా యూట్యూబ్ లో పెళ్లిళ్లు చేసుకున్నారు. విడాకులు కూడా ఇచ్చేస్తున్నారు. అలాంటి వార్తలను ఏమాత్రం పట్టించుకోను. కానీ ఇంట్లో తల్లిదండ్రులు అలా ఉండరు కదా. వాళ్ళు కొంచెం సీరియస్ గా తీసుకుంటారు. వాళ్ల మనసు బాధ పడుతుంది. సో అలాంటి పనులు మానుకోండి

ఇక అలానే నాకు పెళ్లి చేసినా.. ఒకవేళ డివోర్స్ ఇచ్చిన దయచేసి నన్ను కూడా పిలవండి” అంటూ నెటిజన్ల పై నవ్వుకుంటూ విరుచుకుపడింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో పంచుకుంది. ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్లు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *