‘రూ. 2 కోట్లు ఇస్తా పెళ్లి చేసుకో’.. స్టార్‌ హీరోకి లేడీ ఫ్యాన్‌ ప్రపోజల్‌..!

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న యాక్ట‌ర్ల‌లో కార్తీక్ ఆర్య‌న్ ఒక‌డు. త‌క్కువ టైంలోనే స్టార్ డ‌మ్ సంపాదించాడీ యువ న‌టుడు. ‘ప్యార్‌ కా పంచనామా’తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, మొదటి సినిమాతో మహిళల్లో ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. అతడి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌.. అందులోనూ ఫీ మేల్ ఫ్యాన్స్‌ అయితే ఎంద‌రున్నారో చెప్పలేం.

A lady fan bumper offers to hero karthik aaryan

ప్రస్తుతం ‘భూల్‌ భూలియా -2’, ‘షెహ్‌జాదా’ చిత్రాలు చేస్తున్నారు. కాగా, షూట్స్‌లో కాస్త విరామం దొరకడంతో ‘లూడో’ ఫేమ్‌, బాలనటి ఇనాయత్‌ వర్మతో కలిసి కార్తిక్‌ తాజాగా ఓ స్పెషల్‌ వీడియో క్రియేట్‌ చేశారు. కార్తిక్‌ నటించిన ‘ధమాకా’లోని ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని ఇనాయత్‌ చెప్పగానే.. క్యూట్‌గా ఉందంటూ ఆయన నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన వీడియోని కార్తిక్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయగా.. దానిపై స్పందించిన ఓ లేడీ ఫ్యాన్‌.. ‘‘కార్తిక్‌.. మీరంటే నాకు ఇష్టం. మీకు రూ.20 కోట్లు ఇస్తా. నన్ను పెళ్లి చేసుకోండి’’ అని పోస్ట్ చేసింది. దానిపై స్పందించిన కార్తిక్‌.. ‘‘ఎప్పుడు’’ అని సరదాగా రిప్లై ఇచ్చారు.

A lady fan bumper offers to hero karthik aaryan

ఈ చర్చ ఇంతటితో ఆగలేదు. ఈ చాటింగ్ చూసిన మరికొందరు అమ్మాయిలు కూడా మేము కూడా ఇస్తాం 20 కోట్లు నన్ను పెళ్లి చేసుకో అంటూ కామెంట్లతో హీరో వెంటపడ్డారు. దీంతో కార్తీక్‌ ఆర్యన్‌ సరదాగా ఈ ఫన్నీచాట్‌ను ముగించారు. వేలంపాట వేద్దామా అని సరదాగా చమత్కరించాడీ బాలీవుడ్ యంగ్‌ హీరో. అయితే గతంలోనూ ఇద్దరు అమ్మాయిలు కార్తీక్‌ ఇంటి ముందు గోల చేసిన వీడియో వైరల్‌ అయింది. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు “కార్తీక్‌.. ఒక్కసారి బయటకి రావా.. నన్ను పెళ్లి చేసుకో” అని అరుస్తూ హంగామా చేశారు. ఈ యంగ్‌ హీరో లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక కార్తీక్‌ ఆర్యన్‌ చివరిసారిగా ధమాకా సినిమాతో ఆడియన్స్ ముందు వచ్చాడు. ఈ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం నటిస్తున్న అల వైకుంఠపురములో హిందీ రీమేక్ మూవీ షెహజాదాను ఈ ఏడాది నవంబర్‌ 4న రిలీజ్‌ చేయాలని ఆలోచిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *