రిజిస్ట్రార్ నుండి కాపాడండయ్యా అంటున్న వర్శిటీ ఉద్యోగి

“అయ్యా నాకు విక్రమ సింహపురి యూనివర్శిటీ రిజిస్ట్రార్ శివశంకర్ మరియు ఆయన అనుచరుల నుండి బెదిరింపులు వస్తున్నాయి. నాకు ప్రాణహాని ఉంది. నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు. దయచేసి నాకు రక్షణ కల్పించగలరు.” అంటూ ప్రాధేయపడుతున్నాడు వర్శిటీ లో విధులు నిర్వహించే శాశ్వత ఉద్యోగి అయిన ఆములూరు ప్రసాద్. ఈ విషయమై స్థానిక అంబేద్కర్ భవన్ లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా వర్శిటీలో వీసీల దగ్గర డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నానని, ఇప్పుడు కొంతమంది చెప్పుడు మాటలు విని కక్ష్య పూరితంగా రిజిస్ట్రార్ శివశంకర్ తనకు స్థాన చలనం కల్పించారని దానికి సంసిద్ధత వ్యక్తం చేయని తనని వేధించడం మొదలెట్టారని ఎస్సీ అయిన తనను నీ హోదా ఎంత అంటూ కులం పేరుతో దూషిస్తున్నారని దీంతో పొలిసు స్టేషన్ లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తనకు శివశంకర్ నుండే కాకుండా ఆయన అనుచరుల నుండి కూడా బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు హరిబాబు, దళిత నాయకులు చిరంజీవి, బాలసుబ్రహ్మణ్యం, స్వరూప్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *