పాఠశాల సెలవులు కోసం తాగే నీటిలో పురుగుల మందు కలిపిన విద్యార్థి..చివరికి ఇలా?

ఒక విద్యార్థికి స్కూల్ కి వెళ్లడం నచ్చకపోవడంతో ఎలాగైనా స్కూల్ కి సెలవులు ఇప్పించాలని ఉద్దేశంతో ఏకంగా హాస్టల్లో ఉన్నటువంటి తాగే నీటిలో క్రిమిసంహారక మందును కలిపారు. దీంతో ఆ నీటిని తాగి దాదాపు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఒడిశాలోని బర్గర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు జిల్లా యంత్రాంగం స్పందించి విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే…

భట్లీ బ్లాక్‌లోని కమగావ్ హయ్యర్ సెకండరీ స్కూల్‌ హాస్టల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు బుధవారం బిగ్ బాటిల్ లో ఉన్నటువంటి మంచి నీళ్ళు తాగి తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు.ఈ సంఘటన జరిగిన కొన్ని నిమిషాలకు మరో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వీరందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన చికిత్స అందించారు. మరి ఈ ఘటన జరగడానికి గల కారణం ఏంటని ఆరా తీయగా క్రిమిసంహారక మందు వల్ల వీరందరూ అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలపడంతో ఒక్కసారిగా యాజమాన్యం ఆశ్చర్యపోయింది.

వైద్యులు ఈ విధంగా చెప్పడంతో అసలు విషయం ఏం జరిగిందోనని స్కూల్ యాజమాన్యం దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం బయటపడింది.బాలుర హాస్టల్‌లో ఉంటున్న 11వ తరగతి ఆర్ట్స్‌ కోర్సు విద్యార్థి చేసిన పని కారణంగా ఇలాంటి ఘటన చోటు చేసుకుందని గుర్తించారు. ఈనెల 4వ తేదీ ఇంటికి వెళ్లిన ఆ విద్యార్థికి మరిన్ని సెలవులు కావాలని భావించాడు. దీంతో ఎలాగైనా స్కూలుకు సెలవులు వచ్చేలా చేస్తానని తన స్నేహితులతో ఛాలెంజ్ చేశారని అలా చేసిన నేపథ్యంలోనే ఇలా తాగునీటిలో క్రిమిసంహారక మందులు కలిపి తీవ్ర అస్వస్థతకు గురైతే పాఠశాలకు సేవలు వస్తాయని భావించి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసిన పలువురు తల్లిదండ్రులు సదరు విద్యార్థి పై కఠిన శిక్ష తీసుకోవాలని తెలిపారు. ఇక విద్యార్థిపై యాజమాన్యం యాక్షన్ తీసుకోని తనని ఆ పాఠశాల నుంచి పూర్తిగా సస్పెండ్ చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *