మెగాస్టార్ తో త్రివిక్రమ్?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ , మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నాడా అంటే అవుననే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖాదీ నెంబర్ 150 మూవీ చేస్తున్న చిరు , ఇటీవల త్రివిక్రమ్ తో దాదాపు రెండు గంటలకు ఫైగా చర్చలు జరిపాడని సమాచారం..ఈ చర్చలు చూస్తే త్రివిక్రమ్ తో చిరంజీవి సినిమా కన్ఫామ్ అయ్యినట్లే అంటున్నారు సినీ వర్గాలు. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు..ఇటీవలే ఈ సినిమాకు సంబదించిన ముహూర్తపు షాట్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా తర్వాత చిరు తో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది..ఈ లోపు చిరు కూడా తన 151 వ చిత్రాన్ని బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం లో చేయనున్నాడు. దీనికి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. త్రివిక్రమ్ – చిరు సినిమా ఫై అతిత్వరలోనే ఓ ప్రకటన రానుందని సమాచారం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *