మరోసారి ట్రోలింగ్‌ గురైన మంచు లక్ష్మీ.. ‘స్మగ్లర్‌’ అంటూ..!

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మాట్లాడే బాషతోనే ఎంతో ఫేమస్ అయి.. అభిమానులకు మంచు అక్కగా మారిపోయింది. ఇక ఈమె ఏమి చేసిన ట్రోలర్స్‌కు పండగే.. ఏ పని చేసినా ఆమెపై విమర్శల అస్త్రాలు సంధిస్తుంటారు. ఓవర్ యాక్షన్ చేస్తోంది అని, మంచు మోహన్ బాబు కూతురువు కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను ఎవరు భరిస్తారు అంటూ ఘాటుగా మంచు లక్ష్మీని ట్రోల్స్ చేస్తుంటారు. అయితే వీటిని మంచక్క లైట్ తీసుకొని తన పని ఏదో తాను చేసుకుంటూ పోతుంది.

Netizens Trolls Manchu Lakshmi Over Her Latest Instagram Post

ఇక సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది మంచు లక్షీ. నిత్యం సోషల్ మీడియాలో రీల్స్ అని, కూతురు, మేనకోడళ్లతో కలిసి హుషారుగా ఉండే లక్ష్మీ తాజాగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అది కాస్త ట్రోలింగ్‌కు గురైంది. తన షూ కలెక్షన్స్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ క్యాప్షన్ గా “సరైన షూ ఎప్పుడు ఉండదు” అంటూ చెప్పుకొచ్చింది.

ఇది చూసిని కొందరు ఆమెపై నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తుండగా మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ‘కాళ్ళు కాలే కాళ్ళు ఒకచోట. లెక్క లేనన్ని జోల్లు ఒక చోట’, ‘నీ దగ్గర అన్ని జతలు ఉంటే.. అందులో కొన్ని పేద వాళ్లకు పంచోచ్చు కదా’ అంటూ కామెంట్స్‌ చేస్తుండగా మరికొందరూ ‘అంతేకాదు చెప్పులు షాప్‌ పెట్టారా?’, ‘షూ స్మగ్లర్‌’ అంటూ మంచు అక్క పోస్ట్‌పై ఫన్నీగా స్పందిస్తున్నారు. ​కాగా మంచు లక్ష్మి ప్రస్తుతం మలయాళం సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె ఓ పోలీసు ఆఫీసర్‌ పాత్ర పోషిస్తుందని సమాచారం.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *