నిద్రలో గర్భిణి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.?

గర్భిణికి నెలలు నిండేకొద్దీ ఓ పట్టాన నిద్రపట్టదు. అలాగని ఎక్కువ సేపు మెలకువగా ఉండలేని పరిస్థితి. దీని నుంచి అధిగమించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. పడుకునే సమయాన్ని నిర్దష్టంగా పెట్టుకోవాలి. దానికి తగినట్టు దిన చర్యను రూపొందించుకోవాలి. ఒకవేళ నిద్ర రాకపోయినా విశ్రాంతి  కోసం కనీసం నడుము వాల్చాలి. నిద్రపోయేందుకు కనీసం గంట ముందు సెల్ ఫోను, కంప్యూటరు, టీవీ లాంటివాటివి దూరం పెట్టేయాలి. కుదిరితే ఏదైనా పుస్తకం చదవడం మొదలెట్టాలి. దీంతో హాయిగా నిద్రపడుతుంది. గర్భం దాల్చినప్పుడు కాస్త భారంగా అనిపిస్తుంది. అయినప్పటికీ భోజనం చేసిన తర్వాత కాసేపు నడవాలి.

కుదిరితే నిపుణులు పర్యవేక్షణ చిన్న చిన్న వ్యాయామాలూ, యోగాసనాలు వేస్తే మంచిది. దీంతో రాత్రిళ్లు హయిగా నిద్రపడుతుంది. ఈ రోజుల్లో కేవలం గర్భిణులకు వ్యాయామాలూ, ఆసనాలూ చెప్పే నిపుణులూ ఉన్నారు. వారి సేవల్ని ఉపయోగించుకోవచ్చు. వెల్లకిలా పడుకుంటే గర్భిణులకు సౌకర్యంగా అనిపిస్తుంది. కానీ దానివల్ల బిడ్డకు అందే ప్రాణవాయువుకు ఆటంకం ఏర్పడుతుంది. దాంతో తల్లి వెన్నెముకపై భారం పడుతుంది.

అందుకే కాస్త కష్టంగా అనిపించినా ఒక పక్కకు తిరిగి పడుకునేలా చూసుకోవాలి.  అది అసౌకర్యంగా అనిపిసై గనుక పొట్టకు ఆసరాగా దిండ్లు పెట్టుకోవచ్చు. పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడం అసౌకర్యంగా అనిపిస్తుంటే.. తలను కాస్త ఎత్తుగా పెట్టి పడుకోవాలి. అలాగే కాళ్ల అడుగున కూడా ఆసరాగా ఒక దిండు ఏర్పాటు చేసుకుంటే ఇబ్బంది కాస్త తగ్గుతుంది. అయితే డాక్టర్లకు నిత్యం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. చిన్నపాటి ఇబ్బందులు ఎదరైనా వెంటనే డాక్టర్లను సంపద్రించడం ఉత్తమం అని చెప్తున్నారు నిపుణులు

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *