పవన్ దారెటు.. పొత్తులపై పవన్ కళ్యాన్ ఏమంటున్నారు..
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పొత్తుల రాజకీయం నడుస్తోంది. ఎన్నికలకు మరో రెండుమూడేళ్లు ఉన్న క్రమంలో ఇప్పుడు పొత్తుల గురించే చర్చకు వస్తోంది. ఇటీవల కార్యకర్తల సమావేశంలో చంద్ర బాబు నాయుడు వన్ సైడ్ లవ్ కుదరదని వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు మనం పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుందాం అనే కోరికపై వ్యాఖ్యలు చేశారు. గతంలో 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు లేకపోవడంతోనే టీడీపీ ఓడిపోయిందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ వేరువేరుగా పోటీ చేయడం వైసీపీకి ప్లస్ అయింది. దీంతో ఓటు బ్యాంకు పార్టీల వారీగా వేరుపడటంతో గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయని సగటు తెలుగు దేశం కార్యకర్తల ఆవేదన. ఇది కనుక మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఫలితం వేరేలా ఉండేదని అంటున్నారు. ఏపీలో ఉనికిలో లేని కాంగ్రెస్ దోస్తీ కట్టి చంద్రబాబు నాయుడు బ్లెండర్ మిస్టేక్ చేశారని చాలా మంది ఇప్పటికీ అనుకుంటున్నారు. దేశంలో మోదీ, బీజేపీ వేవ్ కొనసాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా… చంద్రబాబు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం టీడీపీ గెలుపుకు బ్రేకులు వేశాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు టీడీపీకి టర్న్ అయిందా అంటే అది లేదు. మరోవైపు భారీ మెజారిటీతో గెలిచిన వైసీపీ, తెలుగు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టీడీపీ నాయకులను నైతికంగా దెబ్బతీస్తోంది.
వైసీపీ నేతల ధాటికి తెలుగు దేశం తట్టుకోలేకపోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల చంద్రబాబు చేసిన వన్ సైడ్ వ్యాఖ్యలపై స్పందించారో లేదో తెలియదు కానీ.. పవన్ కళ్యాన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై నిర్ణయాన్ని జనసైనికుల ఆలోచన మేరకే తీసుకుంటానని స్పష్టం చేశారు. మనతో ఎంతో మంది పొత్తు కోరుకోవచ్చు.. కానీ ప్రస్తుతం మనం బీజేపీతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు. ఏపీలో జనసేన బలంగా ఉందని.. మరింతగా సంస్థాగతంగా బలోపేతం కావాల్సిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రతిగానే పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం సగం పాలనా కాలం పూర్తయింది. మరో ఏడాది గడిస్తే పూర్తిగా ఎలక్షన్ వాతావరణం మొదలవుతుంది. వైసీపీ ప్రస్తుతం ఏపీలో బలంగా ఉంది. దీంతో బలమైన వైసీపీని ఎదుర్కోవాలంటే.. టీడీపీకి పొత్తు చాలా అవసరం… అది కూడా జనసేన చాలా అవసరంగా సగటు టీడీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. మరోవైపు బీజేపీతో పొత్తు వ్యవహారం దాదాపుగా చెడింది. ఇటీవల సోము వీర్రాజు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పొత్తు ధర్మాన్ని ఎప్పుడు కూడా చంద్రబాబు పాటించలేదని ఆయన విమర్శించారు. ఇక ఎన్నికల ముందు ఏదైనా జరిగే అవకాశం ఉంది. రాజకీయంలో ఏదైనా సాధ్యపడవచ్చు. మిత్రులు శత్రువులుగా.. శత్రువులు మిత్రులుగా కూడా మారవచ్చు. ఇప్పుడున్న పగలు ఎన్నికల ముందు ఉండకపోవచ్చు. ఏం జరుగుతుందో.. ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో మున్ముందు చూద్దాం.