‘అవి ఇంప్లాంటేషన్ చేయించుకోమన్నారు’.. బాడీ షేమింగ్‌పై దీపికా కామెంట్స్

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో కష్టాలు అనుభవించిన దీపికా.. ఆ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి తాజాగా వివరించారు. ఈ బ్యూటీ తాజాగా నటించిన ‘గెహరాయియా’ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ.. దీపికా మాత్రం జోరుగా సినిమాను ప్రమోట్ చేస్తుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో తనకు ఎదురైన ఆ చేదు అనుభవాన్ని బయటపెట్టింది దీపికా.

deepika padukone reveals that she was advised to get implants

కెరీర్ మొదలుపెట్టిన ఆరంభంలో ఓ వ్యక్తి తనను బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేయించుకోమని సలహా ఇచ్చాడని చెప్పింది. అప్పుడు తన వయసు 18 ఏళ్లని.. అతడు ఇచ్చిన సలహాకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక సైలెంట్ గా ఉండిపోయానని.. సీరియస్ అవ్వకుండా ఎలా ఉన్నానో ఇప్పటికీ అర్ధం కాదని చెప్పుకొచ్చింది.  అయితే ఈ సలహా ఎవరు ఇచ్చారనే విషయాన్ని మాత్రం దీపికా బయటపెట్టలేదు.

ఇక షారుఖ్ ఖాన్ ను తన జీవితంలో బెస్ట్ సలహా ఇచ్చిన వ్యక్తిగా పేర్కొంది దీపికా. తెలిసిన వాళ్లతో సినిమాలు చేయమని షారుఖ్ చెప్పారట. సినిమాలు చేయడమంటే కేవలం నటించడం కాదని.. జీవితంలో ఓ భాగమని.. కాబట్టి కొన్ని జ్ఞాపకాలను, అనుభవాలను పొందే క్రమంలో తెలిసినవాళ్లతో ట్రావెల్ చేయడమే మంచిదని చెప్పినట్లు దీపికా వివరించింది. ఈ ‘గెహ్రాహియా’ సినిమాలో బోల్డ్‌ పాత్రలో నటించిన దీపిక.. ప్రస్తుతం ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్‌-కె’ అమితాబ్‌తో రీమేక్‌, హృతిక్‌ రోషన్‌తో ‘ఫైటర్‌’ చిత్రాలతో బిజీగా ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *