మెగా, అల్లు ఫ్యామిలీలకు గ్యాప్.. క్లారిటీ ఇచ్చిన బన్నీ మేనమామ!

Mega And Allu Family: సాధారణంగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల గురించి, వారి రిలేషన్స్ గురించి, మరే విషయాలైనా సరే.. పూర్తిగా తెలిసిన తెలియకపోయినా.. ఆ విషయంలో మంచి పుకార్లు లేపుతారు బయట జనాలు. ఇక వీరి మాటలకు కొందరు సెలబ్రెటీలు స్పందిస్తే మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటారు. అదేంటో కానీ జనాలు సినీ ఇండస్ట్రీ అంటేనే మరింత చెవులు కొరుక్కుంటారు.

Mega And Allu Family
Mega And Allu Family

ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీ కి గ్యాప్ వచ్చింది అంటూ ఆ మధ్య వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా ఈ విషయంపై అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి కృష్ణ ప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చాడు. ‘పుష్ప’ సినిమా విజయంలో ముత్తంశెట్టి మీడియా భాగం పంచుకుంది. ఈ నేపథ్యంలో ముత్తంశెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా ముత్తంశెట్టి అల్లు అర్జున్ వ్యక్తిగత విషయాలతో పాటు తమ కుటుంబ విషయాలకు ఆయన క్లారిటీ ఇచ్చాడు. ‘మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీ కి మధ్య గ్యాప్ క్రియేట్ అయింది. అందుకే ముత్తంశెట్టి బ్రదర్స్ లైమ్ లైట్ లోకి వచ్చారంటూ వినిపించిన టాక్ లో నిజమేంత’ అని అక్కడి మీడియా పర్సన్ అడగగా..

ఈ ప్రశ్నకు ముత్తం శెట్టి కృష్ణప్రసాద్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇది నూటికి నూరు శాతం అబద్ధం అని చెప్పి.. కాస్త బాగానే ఘాటుగా మాట్లాడారు. బన్నీ మేనమామలకు గుర్తింపు రావాలనే అలా మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు తప్ప.. బయట జనాలు మాట్లాడుకునే దాంట్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *