పంది చూసి భయంతో చిరుత పరుగో పరుగో..

సాధారణంగా అడవి రాజుగా సింహం, పులి, చిరుత అని చెప్పుకొంటారు. జంతువులను వేటాడి చంపి తన కడుపు నింపు కుంటాయి. అందుకే వీటిని చూస్తే తోటి జంతువులు భయం తో ఆమడదూరం పరిగెడతాయి, పొరపాటున వీటి కంటికి కనిపించాయంటే అంతే సంగతులు. అలాంటి క్రూర మృగాలను ..ఓ అడవి పంది భయపెట్టింది అంటే నమ్ముతారా.. ఎవరైనా వింటే టక్కున నవ్వుతారు. కాని ఇది నిజం. ఓ అడవి పంది.. చిరుతపులి పురుగులు పెట్టించింది.. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Viral Video Leopard Ran Away After Seen Wild Boar Shocking Video Goes Viral on Social Media
Viral Video Leopard Ran Away After Seen Wild Boar Shocking Video Goes Viral on Social Media

అటవి ప్రాంతంలోని ఓ పంది పిల్ల మేత మేస్తోంది. టూరిస్టుగా అక్కడి కి వచ్చిన ఓ యానిమల్ లవర్ దూరం నుంచి వీడియోలు తీస్తున్నాడు. ఇంతలో ఆ పంది పిల్లను చూసిన.. చిరుత ఈ పూటకు ఆహారం దొరికిందని సంబరపడిపోయింది. వెంటానే ఆ పంది పిల్లపై ఎటాక్ చేసింది. చిరుత దెబ్బకు పంది పిల్ల గిలగిల కొట్టుంటుంది. ఇది చూసిన ఆ తల్లి పంది.. కోపంతో చిరుతపై ఎటాక్ చేసేందుకు సిద్ధమైంది. ప్రాణ భయంతో పంది పిల్లను వదిలేసి పరిగెట్టడం స్టార్ట్ చేసింది చిరుత.

అయినా ఆ తల్లి పంది.. చిరుతను వదల్లేదు. ఓ రేంజ్ లో ఉరికించి.. ఉరికించి.. ముప్పుతిప్పలు పెట్టింది. ఈ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజర్లు.. తల్లిప్రేమ ఎంత గొప్పదో తెలియజేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. మరీ మీకు ఈ వీడియో చూస్తుంటే ఏం అనిపిస్తోందో చెప్పండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *