పెళ్లి జరిగిన క్షణాల్లోనే.. వధువు వద్దంటూ వరుడు హల్చల్

పెళ్లి అంటే ఒక బాధ్యత. అందకే మనకు నచ్చిన అమ్మాయికి.. జీవితాతం అండగా ఉంటామని ఏడు అడుగులు వేస్తాము. అయితే వారి దాంపత్య జీవితంలో మనస్పర్థలు రావడం సర్వసాధారణం. కానీ వివాహం జరిగిన క్షణాల్లోనే వధువు, వరుడు మధ్య మనస్పర్థలు రావడం చాలా అదురుగా జరుగుతుంటాయి. కానీ ఓ వరుడు చేసిన పని ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. పెళ్లి అయిన కొద్ది సేపటికే ఇలాంటి ఘటన వెలుగు చూస్తుందని పెళ్లికి వచ్చిన వారు కూడా అనుకోలేదు. అసలు ఏం ఈ ఘటన ఎక్కడ జరిగిదంటే కర్ణాటకలోని దండేలీలో జరిగింది. ఈ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది.

A STRANGE INCIDENT IN KARNATAKA GROOM REJECT THE BRIDE FOR EATING IN THE LEFT HAND
A STRANGE INCIDENT IN KARNATAKA GROOM REJECT THE BRIDE FOR EATING IN THE LEFT HAND

కర్ణాటక రాష్ట్రం లో ఉండే దండేలీలోని వరుడు.. ఓ వింత సాకు చెప్పి..వధువు వద్దంటూ హల్చల్ చేశాడు. బోయిడా కు చెందిన కబీర్ కుతు నాయక్, యల్లాపురకు చెందిన వధువుకు..దక్షణ కన్నడ జిల్లా, కూలగీ ప్రాంతం లో పెద్దల సమక్షం లో వివాహం జరిగింది. అనంతరం అందరూ భోజనాల దగ్గర కుర్చున్నారు. అయితే వధువు.. అంగవైకల్యం కారణంగా ఎడవ చేత్తో భోజనం చేసింది. ఇది చూసిన వరుడు కోపంతో రెచ్చిపోయాడు.

ఈ అమ్మాయి నాకు వద్దంటూ గొడవకు దిగాడు. పెద్దలు, బంధువులు నచ్చజేప్పేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. దీంతో పెళ్లి కూతురు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..పెళ్లి కొడుకు కి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెబుతున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *