మళ్లీ వచ్చిన చాంద్ నవాబ్.. ఈసారి ఒంటె పై అలా!

video: సాధారణంగా న్యూస్ రిపోర్టర్ లు అన్నాక.. ఘటనా స్థలం ఎక్కడికైనా వెళ్లి లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆసక్తికరంగా ఉంటారు. ఆ సమయంలో వారికి ఎలాంటి ఆటంకాలు వచ్చినా అవేవీ పట్టించుకోకుండా లైవ్ రిపోర్ట్ ఇస్తారు. మరి అదే తరుణంలో పాకిస్తాన్ జర్నలిస్ట్ చాంద్ నావాబ్ మరోసారి వెలుగులోకి వచ్చాడు.

చాంద్ నవాబ్ కరాచీలో వాతావరణం మార్పు అప్ డేట్ ఇస్తున్నాడు. కరాచీలో వాతావరణం మారిపోయి ఈదురు గాలులు వస్తున్నాయి. దీనిపై చాంద్ నవాబ్ ఒక గ్రౌండ్ లో నిలబడి కళ్లలో దుమ్ము పడుతున్నప్పటికీ ఆయన కళ్ళు మూసుకొని మరీ గాలి ఎంతలా వీస్తుందో అనే అప్ డేట్ ఇస్తున్నాడు.

అదే సమయంలో అక్కడ నివసించే ప్రజలు ఒంటెలను తీసుకొని యధావిధిగా బయలుదేరుతున్నారు. ఆ గ్రౌండ్ లో ఉన్న చాంద్ నవాబ్ ఇలా అప్ డేట్స్ ఇచ్చాడు. “కరాచీ వాతావరణం చాలా బాగుంది. చల్లటి గాలి వీస్తుంది. వేరే నగర ప్రజలు వచ్చి ఇక్కడ తుఫానును వీక్షించవచ్చు. నా జుట్టు పైకి ఎగురుతుంది. సన్నగా ఉన్నవారు ఇవాళ తీరానికి వెళ్లొద్దు. ఒకవేళ వెళ్తే ఇసుక తో పాటు ఎగిరిపోతారు”.

అంటూ ఫన్నీగా లైవ్ అప్ డేట్స్ ఇచ్చాడు. అంతేకాకుండా వేరొకచోట ఆయన ఏకంగా ఒంటె పైకి ఎక్కి లైవ్ రిపోర్టింగ్ ఇచ్చాడు. ప్రజల ఇంటి నుంచి బయటకు వచ్చి ఈ ప్రత్యేకమైన వెదర్ ను వీక్షించాలని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ లో బాగా వైరల్ అవుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *