విక్రమ సింహపురి యూనివర్సిటీలో జగనన్న పచ్చ తోరణం

  • విక్రమ సింహపురి యూనివర్సిటీలో జగనన్న పచ్చ తోరణం
  • మొక్క నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించిన వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.యం.సుందరవల్లి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ మరియు అనుబంధ కళాశాలల్లో జగనన్న పచ్చతోరణంలో భాగంగా జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలోవన మహోత్సవాన్ని చేపట్టారు. కాకుటూరులోని వి.ఎస్.యూ క్యాంపస్ లో జరిగిన కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య ఆచార్య జి.యం.సుందరవల్లి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వన మహోత్సవాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మేక్ ది వరల్డ్ గ్రీన్ అనే నినాదం తో జిల్లా వ్యాప్తంగా అన్ని అనుబంధ కళాశాలల్లోని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ ఒక్క రోజు మాత్రమే కాకుండా రాబోవు రోజులలో నెల్లూరును పచ్చదనంతో నింపాలని ఒక మంచి సంకల్పం తో సోషల్ ఫారెస్ట్రీ వారి సహకారంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ఒక ఉద్యమం లాగా జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అని అన్నారు. కాలుష్య నివారణ మరియు పర్యావరణ సమతుల్యతనికి చెట్లు పెంచడం ఎంతో అవసరమని చెప్పారు. ప్రజలందరు కూడా మొక్కలు నాటడం తో పాటు వాటిని సంరక్షిస్తే అదే మన భావితరాలకు మనమిచ్చే గొప్ప సంపద అని అన్నారు.

వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపల్స్ కు మరియు ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారులు కు రిజిస్ట్రార్ డా యల్ విజయ కృష్ణా రెడ్డి అభినందనలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ సమన్వయ అధికారి డా. ఉదయ్ శంకర్ అల్లం, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారులు డా. ఆర్ ప్రభాకర్ , డా. వై విజయ, డీన్ డా. విజయ ఆనంద కుమార్ బాబు, డిప్యూటీ రిజిస్ట్రార్ డా. సాయి ప్రసాద్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డా. సుజయ్, అధ్యాపకులు డా. టి వీరారెడ్డి , డా. సిఏచ్ విజయ, డా. సునీత,డా. హనుమ రెడ్డి, డా. వెంకట్రాయులు, డా. ఆర్ మధుమతి , డా సి కిరణ్మయి, డా. బీవీ సుబ్బారెడ్డి మరియు పి ఆర్ ఓ డా. కోట నీల మణికంఠ , ఇతర అధ్యాపకులు , అధ్యాపకేతర సిబ్బంది మరియు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *