ట్విట్టర్ లో ప్రొఫైల్ నేమ్ మార్చిన విజయ్ దేవరకొండ.. ఎందుకో తెలుసా?

Vijay Devarakonda: టాలీవుడ్ ప్రేక్షకులకు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఆ పేరుకే ఎంతో మంది ప్రేక్షకులే ఫిదా అయ్యారు. అర్జున్ రెడ్డి సినిమాతో తన సక్సెస్ ట్రాక్ నిలబెట్టుకుని టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు. దేవరకొండ తన యాటిట్యూడ్ తో ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో తాను ఒకడిగా వెలుగుతున్నాడు.

ఇక విజయ్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు. ఇదిలా ఉంటే విజయ్ తాజాగా తన ట్విట్టర్ ప్రొఫైల్ నేమ్ కి తుఫాన్ అనే పదాన్ని జత చేశాడు. ఈ పదం నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా కొంతమందిని ఆలోచింపజేస్తుంది కూడా. అసలు విజయ్ సడన్ గా తుఫాన్ అనే పదాన్ని ఎందుకు యాడ్ చేసాడు అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే పదం మీద కొందరు నెటిజన్లు సెర్చ్ చేయడం స్టార్ట్ చేసారు. కాగా వారికి ఒక చిన్న క్లూ దొరికింది. అదేమిటి అంటే? విజయ్ దేవరకొండ ఒక యాడ్ షూట్ లో ఇచ్చిన స్టిల్ లో తుఫాన్ టాగ్ కనిపించింది. దీంతో అందరూ అసలు విషయం గ్రహించుకున్నారు. ఇక విజయ్ ప్రస్తుతం లైగర్ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *