సైనాకు తిరిగి క్షమాపణలు చెప్పిన హీరో సిద్ధార్థ్!

Siddharth And Saina :ఇటీవల ప్రధానమంత్రి పంజాబ్ పర్యటన సమయంలో ఆయనపై దాడి చేయడంతో దేశం ఒక సారిగా స్టన్ అయింది. ప్రధాన మోడీకి మద్దతుగా బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ ద్వారా ఇలా స్పందించింది. దేశ ప్రధాని అయినా ఆయనకే అలా జరిగితే మరి సాధారణ ప్రజల సంగతి ఏంటి? అని పంజాబ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సైనా నిహాల్ ట్విట్టర్ ఖాతా వేదికగా ట్వీట్ చేసారు.

Siddharth And Saina
Siddharth And Saina

దీనిపై సిద్ధార్థ స్పందించిన తీరు ఇబ్బందికరంగానే ఉందని చెప్పొచ్చు. సైనా నెహ్వాల్ ను విమర్శించేందుకు కొంచెం అసభ్యకర పదాలు వాడారు. రెండు అర్థాలు వచ్చేలా ఆ ఇంగ్లీష్ వర్డ్ ని యూస్ చేసి కవర్ చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు. సిద్ధార్థ్ చేసిన ట్వీట్ కు అసభ్యకర వ్యక్తం చేసి కొంతమంది ప్రముఖులైన చిన్మయి, కేంద్ర మంత్రి, సైనా తండ్రి తో పాటు పలు ప్రముఖులు తమదైన శైలిలో హీరో సిద్ధార్థ పైన విరుచుకు పడ్డారు.

ఇదిలా ఉంటే నటుడు సిద్దార్థ్ తాను పెట్టిన కామెంట్స్ పై మళ్లీ స్పందించాడు. బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కు సారీ చెబుతూ సిద్ధార్థ్ అధికారికంగా ఓ లెటర్ రాశాడు. సైనా పై తాను పెట్టిన పోస్ట్ ఒక జోక్ మాత్రమే అని వివరించాడు. కానీ తాను పెట్టిన పోస్ట్ అందరిని భావించేలా చేసిందని అన్నాడు. తనకు మహిళలను కించపరుస్తూ మాట్లాడే ఉద్దేశం లేదని.. సైనా నెహ్వాల్ ఎప్పుడూ ఒక గొప్ప క్రీడాకారిణి అని కనుక అలాంటి కామెంట్స్ పెట్టినందుకు. క్షమాపణ కోరుతున్నాను అని నటుడు సిద్దార్థ్ తెలిపాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *