వధూవరులపై డబ్బుల వర్షం కురిపించారు.. కానీ ఇంతలో ఏం జరిగిందంటే!

Viral Wedding Video: ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లకు వధూవరుల ఫ్రెండ్స్ తమదైన స్టైల్లో గిఫ్ట్ లు ఇస్తున్నారు. అనేక రకాల ఫన్నీ ఫ్రాంక్ గిఫ్ట్ లను ఇచ్చి వధూవరులను ఆటపట్టిస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మరి ఇలాంటి దానికే సంబంధించిన వీడియోనే తాజాగా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఒక పెళ్లి ఫంక్షన్ లో వధూవరులు స్టేజిపై సోఫాలో కూర్చుని ఉన్నారు. ఈలోపు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి వాళ్ల తల పై డబ్బులు వర్షం కురిపించారు. ఇక ఆ సమయంలో మిగిలిన ఫ్రెండ్స్ ఆ వీడియోని తీస్తున్నారు. తమ మీద డబ్బులు వర్షం కురిపిస్తున్నందుకు వధూవరులు ఎంతో ఆనంద పడుతున్నారు. కానీ ఇంతలోనే తమ ఫ్రెండ్ ఒక స్టంట్ చేసాడు.

డబ్బులు వర్షం కురిపిస్తున్న ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి.. సోఫా సైడ్ హ్యాండ్ పై కూర్చొని ఫోటో దిగాలి అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి అక్కడి నుంచి ఆ వధూవరుల మీద పడ్డాడు. దాంతో అప్పటివరకూ హ్యాపీగా ఉన్న జంట ఒక్కసారిగా తన మీద విరుచుకుపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియా ఇన్ స్టా లో బాగా హడావిడి చేస్తుంది.

 

 

View this post on Instagram

 

A post shared by DIVYA SHARMA ™ (@divusharma_9)

దివుశర్మ-9 అనే ఖాతాల ఈ వీడియోను పంచుకున్నారు. ఒకసారి ఈ వీడియోపై లుక్ వేసిన నెటిజన్లు మరొక్కసారి చూడక తప్పటం లేదు. ప్రస్తుతం ఈ వీడియో ఒక లక్ష యాభై రెండు వేల లైక్ లతో తెగ హడావిడి చేస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *