భుజాలపై కుమారుడి శవం.. కన్నీరు తెప్పిస్తున్న వీడియో!

కొడుకు మృత‌దేహాన్ని తీసుకేళ్లేందుకు వాహ‌నాలు లేక‌పోవ‌డం తో మోసుకెళ్లాడు ఓ తండ్రి. ఈ విషాధ ఘ‌ట‌న ఓడిశాలోని చోటు చేసుకుంది. ఇలా ఆ వ్యక్తి మోసుకుని పోవడం ప్రస్తుతం వైరల్ గా మారంది . రాయ‌గ‌డ జిల్లా హరిజ‌న్ సాహి ప్రాంతానికి చెందిన‌.. ఆకాశ్ బ‌నియా వ‌య‌స్సు తొమ్మిదేళ్లు. ఆడుతూ పాడుతూ తిర‌గాల్సిన వ‌య‌స్సులో ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. ఇప్ప‌టికే మందుల కోసం చాలా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టారు త‌ల్లి దండ్రులు. కొంత‌కాలం బాగానే ఉంది. కా్ని ఆదివారం రోజు ఆ బాలుడికి సిరియ‌స్ అయ్యింది.

FATHER CARRIES SON DEAD BODY ON HIS SHOULDER ABOUT AN HALF KILOMETER
FATHER CARRIES SON DEAD BODY ON HIS SHOULDER ABOUT AN HALF KILOMETER

తండ్రి సుర్ధార్ బ‌నియా కంగారుప‌డి ఆ రోజు రాత్రే ద‌గ్గ‌ర‌లో ఉన్న జిల్లా ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. వైద్యులు.. ఆ బాలుడికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ఆ తండ్రి మాట చెప్పారు. అందే అ తండ్రి గుండే బ‌ద్దులైపోయింది. మీ కొడుకు తీసుకోస్తున్న దారి మ‌ధ్య‌లోనే మృతి చెండాడ‌ని చెప్పారు వైద్యులు. దీంతో బాలుడు కుంటుంబ స‌భ్యులు కన్నీరు మున్నీరయ్యారు. దీంతో ఆ గ్రామంలో విషాధ‌చాయ‌లు అలుముకున్నాయి.

అయితే మృత‌దేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వాహ‌నాలు అందుబాటు లో లేవు. దీంతో ఆ తండ్రి త‌న భుజంపైనే తీసుకెళ్లాల‌ని భావించాడు .. దీంతో త‌న కొడుకు మృతదేహాన్ని భుజంపై ఆర కిలో మీట‌రు వ‌ర‌కు న‌డుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన జిల్లా అధికారులు సిరియ‌స్ అయ్యి.. ద‌ర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. దీని కేసు న‌మోదు చేసుకున్నపోలీసులు.. అస‌లు ద‌ర్యాప్తు వేగ‌వంతం చేశారు. ప్రస్తుతం ఈ వార్త చూసిన నెటిజన్లు చాలా ఫీల్ అవుతున్నారు. కామెంట్లు చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *