పాపం.. వారి కోసం త్వరగా చనిపోవాలని కోరుకున్న వర్మ!

Ram Gopal Varma: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మనందరికీ తెలిసిందే. హర్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలకు ప్రాణం పోయడంలో దిట్ట వర్మ. శివ, క్షణం క్షణం, రంగీలా, సత్య, భూత్ వంటి ఫిలిమ్స్ కు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఎంతో మంది యువతని ఆర్జీవి తన డిఫ్రెంట్ యాటిట్యూడ్ తో ఫిదా చేసుకున్నాడు.

Ram Gopal Varma
Ram Gopal Varma

ఏ విషయమైనా వెంటనే స్పందిస్తూ తనదైన స్టైల్ లో కామెంట్ చేస్తూ ఉంటాడు. ఇక కొన్ని కొన్ని సార్లు ఏ ఒక్కరిని వదలకుండా వార్తల్లో హడావుడి చేస్తూ ఉంటాడు. వర్మ పండగలకు.. పబ్బాలకు.. విష్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడు. ‘తనకు నచ్చనిది ఏదీ చేయను.. తనకు నచ్చితే ఏదైనా చేస్తా’ అనే మైండ్ సెట్ తో ఉంటాడు.

ఏ పండుగకు విష్ చేయని వర్మ.. తాజాగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. తన ట్విటర్ ఖాతా ద్వారా వరుస ట్వీట్లతో అందరికీ మంచి జరగాలని కోరాడు. ఇక అందులో తాను పంచుకున్న విషయం ఏంటంటే.. ‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు అంబానీని మించిన ఇల్లు, డబ్బు రావాలి. మీకు ఎప్పుడూ.. ఎలాంటి వైరస్ సోకకూడదు.

‘అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు, అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు దొరకాలి. భర్తలను భార్యలు వేధించకూడదు. మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా మీ భార్యలు మీతో బాగుండాలి. నన్ను ద్వేషించే వారి కోసం నేను త్వరగా చనిపోవాలి’. అంటూ పలు ట్వీట్లతో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు ఆర్జీవి. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *