నెరువు నలుపుగా కావాలంటే..?

చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు నెరిసిపోవడం. చిన్న పిల్లలు, యుక్త వయసు వారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మరి దీనికి కారణాలు ఏంటి.. పరిష్కారం ఏంటి చూద్దామా…శరీరమే కాదు జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన మోతాదులో విటమిన్లను తీసుకోవాలి. వీటి లోపం వల్ల జుట్టు నెరవడం మొదలవుతుంది. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి6, బి12, బయోటిన్, డి, ఈ విటమిన్లు లోపిస్తే ఈ సమస్య ఎదురవుతుంది. ముందు ఏ విటమిన్ లోపం ఎదురవుతుందనేది తెలుసుకుని, అవి అందే అహారం తీసుకోవాలి. అవసరం అయితే వైద్యుల సలహాతో సప్లిమెంట్లను ఎంచుకోండి.

అవసరానికి మించి ఎక్కువసార్లు రసాయనాలున్న షాంపు వాడినా సమస్యేనని గుర్తుంచుకోవాలి. వీటిని ఎంత పరిమితంగా వాడితే అంత మంచింది. కాబట్టి వీటిని వీటిని పరిమితంగా వాడాలి. తలనూనెను జుట్టుకు పెట్టుకోవడంలో నేడు చాలా మంది మానేశారు. ఇది సరైన పద్ధతి కాదు. జుట్టుకు పోషన్ అవసరం. రోజూ కాకపోయినా వారంలో ఒకటిరెండుసార్లు నూనె పెట్టుకుని మర్థన్ చేసుకోవాలి. ఇలా చేస్తే జుబ్బు పొడిబారకుండా, రంగు మారకుండా ఉంటుంది.

జుట్టు నెరవడానికి నిద్రలేకపోవడం, ఒత్తిడి కూడా కారణం అవుతాయి. మీకు ఆరోగ్య కరమైణ నల్లటిజుట్టు కావాలంటే ఒత్తిడి తగ్గించుకోవాలి. వేళకు నిద్రపోవాలి. ధ్యానం, వ్యాయామాలు వంటివి ఈ సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. జుట్టు నెరవడానికి కుటుంబ చరిత్రా ఓ కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ సంకేతాలు ముందే తెలుస్తాయ కాబట్టి మొదటి నుండి జాగ్రత్తలు తీసుకోవాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *