తన భర్త కలను నెరవేర్చిన భార్య.. కన్నీళ్లు పెట్టించే కథ!

Viral Video: ప్రస్తుతం మహిళలు తమ భర్త తో సమానంగా ఇంటిని చూసుకుంటూ కూడా సంపాదిస్తున్నారు. భార్య భర్తలు ఇద్దరూ కలిసి సంపాదిస్తుంటారు కానీ భార్యాభర్తల్లో ఎవరైనా మరణించినట్లయితే కుటుంబ భారం మొత్తం మిగిలిన ఆ వ్యక్తి మీద పడుతుంది ఇప్పుడు అలాంటి సంఘటనే మనం చూడవచ్చును ఒక మహిళ తన భర్త కన్నా కలలను నెరవేర్చింది. తన భర్త చనిపోయిన తరువాత ఇంటి బాధ్యత మొత్తం ఈ మహిళ మీద పడింది. దాంతో ఈ మహిళ తన భర్త మొదలుపెట్టిన పనిని తను పూర్తి చేస్తూ వచ్చింది.

Viral Video
Viral Video

ఈ మహిళ భర్త మటన్ షాప్ ను ప్రారంభించారు ఇది ఢిల్లీ సెక్షన్ 24 రోహిణీలో చంపారన్ లో ఈ మటన్ షాప్ ఉంటుంది. ఈ షాప్ ను ఈ మహిళ ఒక్కతే చూసుకుంటున్నారు. ఈ మహిళ భర్త ఈ మటన్ షాప్ ను ప్రారంభించి ఇందులో మంచి పేరు తెచ్చుకోవాలి అనుకున్నారు. తను చేసిన మటన్ కర్రీ ఎక్కువమంది తినేలా ఉండాలని ఆశపడే వారు కానీ ఈ షాప్ ను ప్రారంభించిన వారం రోజులకే కొన్ని కారణాల వల్ల ఈ మహిళ భర్త చనిపోయారు. దాంతో కుటుంబ భారం మొత్తం ఈ మహిళ మీద పడిపోయింది. దాంతో ఈ మహిళ తన భర్త కోరుకున్న కలలు నెరవేరుస్తూ ఆ షాప్ ను తనే ప్రారంభించి అందరికీ నచ్చేలా మటన్ కర్రీ వండుతుంది.

అయితే అంత సులభంగా ఈ మహిళ తన భర్త కలను నెరవేర్చ లేకపోయింది. కానీ పట్టుదలతో ముందడుగు వేసి అటు కుటుంబాన్ని,ఇటు తన భర్త మొదలుపెట్టిన మటన్ షాప్ ను ప్రారంభించింది. ఈ మటన్ కర్రీ ని గ్యాస్ మీద కాకుండా సహజ పద్ధతిలో బొగ్గులను ఉపయోగించి వాటి వేడి మీద కుండలో ఈ మటన్ కర్రీ అందరికీ నచ్చేలా వండుతూ తన వంట ప్రాముఖ్యతను పెంచుకుంది. దీంతో ఎక్కడెక్కడి వారు అందరూ వచ్చి ఈ మటన్ కర్రీ ని తినటానికి ఇష్టపడుతూ కోనుక్కుంటూ ఉంటారు.

ఈ వీడియోను ఓ ఫుడ్ బ్లాగర్ ఈ ఫుడ్ స్టాల్‌కి వెళ్లాడు. ఆమె కథను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ thefoodiehat లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోని 20 లక్షల మందికి పైగా చూడగా దాదాపు 2 లక్షల మంది లైక్ లు చేశారు.ఇందులో ఒక యూజర్ వావ్ అద్భుతం ఆమెను చూసి గర్వపడుతున్నాను అని కామెంట్ ఇవ్వగా “మీకు ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని మరో యూజర్ స్పందించారు.

ఇక ఈ మటన్ చూడటానికి చాలా బాగుంది. రుచికరంగా ఉన్నట్లు కనిపిస్తోంది.అని మరో యూజర్ కామెంట్ ఇవ్వగా,మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. మీకు బాగా కలిసిరావాలి అని మరో యూజర్ కోరుకుంటూ కామెంట్ చేశారు. ఇలాంటి మహిళలు మన దేశానికి ఆదర్శకరమని నేటిజన్లు తెలుపుతున్నారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *