2022లో ఈ పనులు చెయ్యండి.. ఆరోగ్యాంగా ఉండండి!

2020, 2021 లో కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు, పరిశ్రమలు, కంపెనీలు ఇలా అన్నీ మూతపడడంతో పాటు ఎక్కడికక్కడ సంబంధించి పోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అలాంటి సమయాలలో ఉద్యోగం చేసే తల్లిదండ్రులు తమ పిల్లల ఆలనాపాలనా చూసుకునే అవకాశం ఈ కరోనా మహమ్మారి పుణ్యమా అని మొట్టమొదటిసారిగా దొరికింది. అయితే కరోనా మహమ్మారి లేకపోయినప్పటికీ వచ్చే ఏడాది 2022 కూడా పిల్లలతో ఎలా గడపాలి..ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్ని అంశాల గురించి చర్చించుకుందాం..

కరోనా మహమ్మారి వల్ల పిల్లలు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులు ద్వారా చదువుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే చాలా మంది పిల్లలు ఒంటరిగా ఫీల్ అయ్యారని, అధ్యయనాలు తేలింది. మరి పాఠశాలలు తెలుసుకోవడంతో పిల్లలు యధావిధిగా పాఠశాలకు వెళ్తున్నారు. కాబట్టి పిల్లల మెంటల్ దీన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ఒంటరితనం అన్న ఫీలింగ్ రాకుండా చూసుకోవాలి.

కరోనా మహమ్మారి పుణ్యమా అని చిన్న పిల్లలకు కూడా సోషల్ మీడియా అంటే ఏంటో తెలిసి పోయింది. చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియాలో మునిగితేలుతున్నారు. సోషల్ మీడియా ద్వారా మంచి ఎంత ఉందో.. చెడు కూడా అంతే ఉంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

అలాగే పండుగ సమయాలలో బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం అనేది ప్రతి ఒక్కరికి సంతోషకరమైన విషయం. పండుగ సమయాల్లో ఇచ్చుకునే బహుమతులు కేవలం గిఫ్టు లాగే ఉండకుండా అది చూసిన ప్రతి క్షణం ఇచ్చిన వారు గుర్తుకు వచ్చే విధంగా ఉండాలి. అందుకే చిన్నప్పటి నుంచి ఇవ్వడం అలవాటు చేస్తే బంధాలు బాగా వికసిస్తాయి.

అప్పట్లో మాదిరి కాకుండా ఆడపిల్ల, మగ పిల్లల అనే తేడా లేకుండా ఇద్దరినీ సమానంగా చూడాలి. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడడం వల్ల రాబోయే తరాల వారికి ఇది కష్టంగా మారుతుంది. కాబట్టి ఆడా మగా అన్న తేడా లేకుండా సమానత్వం అన్నది గుర్తుంచుకోవాలి.

కొంత మంది పిల్లలు తమ తల్లిదండ్రులను విచిత్రమైన ప్రశ్నలను గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటారు. అలాంటి క్రమంలోనే తల్లిదండ్రులు విసుగ్గా మాట్లాడతారు. కానీ అలా చేయకుండా తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా పిల్లలు ఏం చెబుతున్నారు ముందుగా విని వారు అడిగిన దానికి సమాధానం చెప్పడం వల్ల తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య బంధం ఇంకాస్త బలపడుతుంది.

అదే విధంగా పిల్లలు బాగా చదువుకోవాలని దూరమున్న కాలేజీలలో, స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలలో తల్లిదండ్రుల అవసరం పిల్లలకు బాగా ఉంటుంది. అలాంటి సందర్భాలలో తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉండటం వల్ల పిల్లలు చదువుపై దృష్టి పెట్టడం, లోన్లీ గా ఫీల్ అవ్వకుండా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *