ఈ వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే ఇక మీ ఇంటికి ధన ప్రవాహమే?

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎంతో కష్టపడతారు. ఈ క్రమంలోనే కొందరు ఎంత కష్టపడినా డబ్బు మాత్రం చేతిలో ఉండదు. అలాంటివారికి డబ్బు వారి ఇంట్లో కొలువై ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని రకాల వస్తువులను ఇంటిలో ఉంచుకోవాలని పండితులు చెబుతుంటారు. మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయాన్ని గురించి ఇక్కడ తెలుసుకుందాం…

ఓంకారం: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఓంకారం గుర్తు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.ఈ క్రమంలోనే ఈ గుర్తును మన ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా లేదా ఇంటి మధ్యలో ఎక్కడైనా ఉంచితే మన ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.

పూర్ణకుంభం: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యం జరిగిన తప్పకుండా పూర్ణకుంభం ఉంటుంది.పూర్ణకుంభం శుభానికి సంకేతం కనుక మన ఇంట్లో పూర్ణకుంభం ఉండడం వల్ల ఎంతో శుభ ఫలితాలు కలగడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పవచ్చు. ఆ పూర్ణ కుంభం పూజ గదిలో ఉంచడం ఎంతో ఉత్తమం.

నీటిలో తాబేలు: చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు పూజ గదిలో ఒక గాజు గ్లాసు నిండా నీటిని తీసుకొని అందులో తాబేలు విగ్రహాన్ని ఉండడంవల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.అయితే గ్లాస్ లో నీటిని వేసి తాబేలును పెట్టేటప్పుడు తాబేలు తల ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *