ఎంతో ఇష్టంగా స్కూటీ కొన్న యువతి.. కానీ ఆ పదం వల్ల స్కూటీలో వెళ్లలేక కష్టాలు?

ప్రస్తుత కాలంలో ఎంతో మంది యువతులు స్కూటీ లను కొనుగోలు చేసి వారి అవసరానికి వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఒక యువతి ఫ్యాషన్ డిజైనింగ్  కోర్సు చేస్తూ ప్రతిరోజుర్సు
జనక్‌పురి నుండి నోయిడా వరకు ఢిల్లీ మెట్రో ద్వారా ప్రయాణిస్తుంది.ఇలా ఇంత దూరం ప్రయాణం చేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉండటం వల్ల ఆ యువతి ఒక స్కూటీ కొనుగోలు చేసింది. స్కూటీలో వెళ్లి రావడం వల్ల తనకు సమయం ఎంతో ఆదా అవుతుందని భావించితన తల్లిదండ్రులను స్కూటీ అడగడంతో ఆ తల్లిదండ్రులు తన పుట్టినరోజు సందర్భంగా తనకు స్కూటీని బహుమతిగా కొనిచ్చారు.

ఇలా స్కూటీ రావడంతో ఎంతో ఆనందపడిన ఆ యువతి ప్రస్తుతం స్కూటీపై బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అందుకు గల కారణం ఆ స్కూటీ నెంబర్ ప్లేట్ పై SEX అనే పదం ఉండటంవల్ల యువతి స్కూటీలో బయట ప్రయాణం చేయలేకపోతోంది.మొదట నెంబర్ ప్లేట్ వచ్చినప్పుడు పెద్దగా ఎవరూ గమనించరని భావించిన ఆ యువతి ఆ విషయాన్ని తన స్నేహితులు గ్రహించి తనని హేళన చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ విషయం ఇరుగుపొరుగు తెలియడంతో ఆమెకు ఎంతో ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే కొందరు స్కూటీ ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ యువతి ఆ బండి పై వెళ్లడమే మానేసింది.

ఇక ఈ విషయం గురించి తన తండ్రి ఆర్టిఓ ఆఫీస్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తూ తన బండి నెంబర్ ప్లేట్ మార్చాలని సూచించారు. ఈ క్రమంలోనే అధికారులు ఢిల్లీలో `SEX` సిరీస్‌ నుంచి మొత్తం పదివేల వాహనాలకు నెంబర్ ప్లేట్ లో కేటాయించామని ఇది పెద్ద విషయం కాదని వారు వెల్లడించారు. ప్రస్తుతం ఈ స్కూటీకి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *