చాలా రోజులకు వెలుగులోకి వచ్చిన రానా ‘1945’ సినిమా.. అప్పుడే విడుదల!

కొన్ని కొన్ని సార్లు సినిమాలు అనివార్య కారణాల వల్ల విడుదలకు నోచుకోలేకపోతాయి. దాంతో ఆ సినీ నిర్మాతలు కూడా ఆ సినిమాలను పట్టించుకోవడం వదిలేస్తారు. కానీ ఈ మధ్య నిర్మాతలు మళ్లీ తమ పాత సినిమాలను తవ్వుతున్నారు. తాజాగా రానా నటించిన ‘1945’ సినిమా చాలా రోజులకు ఇటీవల వెలుగులోకి వచ్చింది.

సత్య శివ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండేది. కానీ ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇందులో రానా ఫ్రీడమ్ ఫైటర్ గా నటించాడు. ఈయన సరసన రెజీనా హీరోయిన్ గా నటించింది. ఇందులో నాజర్, సత్య రాజ్, ఆర్ జే బాలాజీ తదితరులు నటించారు.

ఇక ఈ సినిమాను గత నెల 31న తెరకెక్కిస్తారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ సినిమాపై బాగా కాంట్రవర్సీలు వచ్చాయి. గతంలో ఈ సినిమా పోస్టర్ విడుదలైనప్పుడు కూడా రానా పోస్టర్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు.

ఈ సినిమాతో తనకు సంబంధం లేదని గట్టిగా చెప్పేసాడు. అంతేకాకుండా నిర్మాతపై కూడా మండిపడ్డాడు. కానీ నిర్మాత ఈ సినిమాకు మద్దతుగా స్పందించాడు. డైరెక్టర్ శివ కూడా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా విడుదల తర్వాత ఎటువంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *