మంచు విష్ణు ఇంట్లో వంట చేసిన సన్నీ లియోన్.. వైరల్ వీడియో

మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘గాలి నాగేశ్వరరావు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సిటీలో జరుగుతోంది. ఇందులో సన్నీ లియోన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో రేణుక పాత్రలో ఆమె కనిపించనున్నారు. షూటింగ్ మధ్యలో కాస్త విరామం లభించడంతో సన్నీ లియోన్ కిచెన్‌లో అడుగుపెట్టారు. పరోటాలు చేశారు. అప్పుడు వీడియో తీసిన విష్ణు మంచు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Sunny Leone makes yummy parathas at Vishnu Manchu's house

హాఫ్ శారీ కట్టుకున్న సన్నీ లియోన్ విష్ణు ఇంట్లో ఉన్న కిచెన్ లో పరాటా చేసింది. పక్కన ఉన్న విష్ణు ఆమెకు ట్రైనింగ్ ఇచ్చాడు. తాను చేసిన వంట గురించి సన్నీ లియోన్ మంచు విష్ణుకు వివరంగా తెలియజేసింది. ఇక మంచు విష్ణు ఆమెకు తెలుగు పదాలు నేర్పుతూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనికి సంబంధించిన వీడియోను సన్నీ లియోన్ తన సోషల్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అయ్యింది. సన్నీలియోన్‌ను వంటమనిషిని చేశావు కదా అంటూ మంచు విష్ణుపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది ఆమెను అచ్చతెలుగు అమ్మాయిలా చీరలో బాగున్నావంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

బాలీవుడ్‌ హీరోయిన్  సన్నీ లియోన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె అందం, మంచితనంతో అనేకమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక సన్నీ గతంలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మంచు మనోజ్ చిత్రం ‘కరెంట్ తీగ’లో సన్నీ మెరిసింది. ఇప్పుడు మంచు విష్ణు సినిమాలో నటిస్తోంది. ఆమె రెండు తెలుగు సినిమాలు కూడా మంచు వారి చిత్రాలే కావడం గమనార్హం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *