కుటుంబ సభ్యులతో పుష్ప స్పెషల్ షో వీక్షించిన బాలయ్య!

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి నట సింహా బాలయ్య ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీ గా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవలే బోయపాటి కాంబినేషన్ లో అఖండ సినిమా విడుదల కాగా ఈ సినిమాతో బాలయ్య కెరీర్ పరంగా బెస్ట్ సక్సెస్ అందుకున్నాడు. ఇక అఖండ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా పలు భాషల్లో విడుదల కాగా తెలుగులో కాకుండా మిగతా భాషల్లో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాను చూసిన సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ నటనకు ఫిదా అయ్యారు. ఇక తాజాగా బాలకృష్ణ కూడా ఈ సినిమాను వీక్షించాడు. మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు బాలకృష్ణ కోసం హైదరాబాదు ప్రసాద్ లాబ్స్ స్పెషల్ స్క్రీనింగ్ ను ఏర్పాటు చేశారు.

ఇందులో బాలయ్యతో పాటు తన భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ, కూతురు తేజస్విని, ఆయన సోదరి పురందేశ్వరి సహా పలువురు ఈ సినిమాను చూశారు. బాలయ్య ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. పుష్ప సినిమా బాగుందని అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడని తెలిపాడు. ఇక పుష్ప 2 షూటింగ్ త్వరలో ప్రారంభమై దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపాడు. ప్రస్తుతం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *