కంటి చూపు మందగిస్తోందా… భోజనం తర్వాత ఇది తినాల్సిందే!

సాధారణంగా వయసు పైబడుతున్న కొద్దీ కంటి చూపు తగ్గడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే చాలా మంది చూపు తగ్గడం వల్ల సర్జరీలు చేయించుకుంటూ కంటిచూపును మెరుగు పరుచుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కంటిచూపు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరికి ఆన్లైన్ తరగతులు నిర్వహించడం వల్ల చిన్న పిల్లలు కూడా ల్యాప్ టాప్ సెల్ ఫోన్ లో ముందు గంటలతరబడి కూర్చోవడం వల్ల కంటి చూపు మందగిస్తుంది.అయితే ఈ విధంగా కంటి చూపు తగ్గిన వారు భోజనం తర్వాత ఈ ఒక్క చిన్న పని చేస్తే కంటి చూపు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.

సాధారణంగా మనం ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు భోజనం చేసిన తర్వాత సోంపు ఇవ్వడం మనం చూస్తుంటాము. అయితే ఇలా సోంపు మాత్రమే ఎందుకు ఇస్తారు అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. భోజనం చేసిన తర్వాత సోంపు తినటం వల్ల నోటి దుర్వాసన తగ్గిపోతుంది.అలాగే నోట్లో పెరిగే చెడు బ్యాక్టీరియాలు కూడా తొలగిపోతాయి. అందుకే భోజనం చేసిన తర్వాత రెస్టారెంట్లో మనకు సోంపు ఇవ్వడం జరుగుతుంది.

ఇక మనకు తెలియని విషయం ఏమిటంటే సోంపులో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్, క్యాల్షియం, పొటాషియం, జింక్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఉంటాయి. కనుక ఇవి కంటిచూపును మెరుగు పరచడంలో కూడా కీలకపాత్ర వహిస్తాయి. అందుకే చూపు మందగిస్తుంది వారు ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత తప్పకుండా
సోంపు తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుందని నిపుణులు వెల్లడించారు. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *