నోటిపూత ఇబ్బంది పెడుతోందా.?

బాడీలో వేడి పెరిగినప్పుడు ఆటో మేటిక్ గా నోటి పూత కూడా వస్తుంది. దీంతో సరిగ్గా తినలేని పరిస్థితి కూడా ఉంటుండి. ఏదైనా మాట్లాడాలన్నా ఇబ్బంది పడతారు. ఎందుకంటే నోరు పూసినప్పుడు చిగుళ్లు, బుగ్గల వెనకబాగం, పెదవి లోపల పుండ్లు పూస్తాయి. అంతేకాదు సన్నగా రక్తం కూడా వస్తుంది. ఇక కాస్త కారం తగిలిందంటే తట్టుకోలేని మంట మొదలవుతుంది. దీన్ని చిన్న సమస్యగా తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. నోరు పూసినప్పుడు ఎండు కొబ్బరి, బెల్లం కొద్దిగా తీసుకుని కాసేపు నమలాలి. ఇలా చేయడం వల్ల కూడా నోటి పూత తగ్గుతుంది.

నోటి పూతను తగ్గించుకోవడానికి బీ-కాంప్లెక్స్ టాబ్లెట్ ను వాడచ్చు. ఇది చిన్నపాటి పుండ్లను మాడ్చడంలో ఉపయోగపడుతుంది. అంతేకాదు..నోటిపూతను తగ్గించడానికి కోకోనట్ ఆయిల్ కూడా మంచిగా పని చేస్తుంది. కొంచెం కొబ్బరి నూనె తీసుకొని పుండ్లు ఉన్న చోట రాయాలి. ఇలా చేయడం వల్ల చల్లగా అయి, మంట తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. తేనె వల్ల కూడా నోటి పూతను తగ్గించుకోవచ్చు. తెనెలో సిద్ధమైన యాంటీ బయోటిక్ గుణాలు ఉంటాయి. తేనెకు ఇన్ఫెక్షన్ తో పోరాడే లక్షణాలు బాగా ఉంటాయి.

తేనెను పుండ్లు ఉన్న ప్రదేశంలో రాసుకోవాలి. తేనే రాసుకున్న తరువాత అరగంట వరకు ఎటువంటి ఆహార పదార్థాలను, ద్రవ పదార్థాలను తీసుకోరాదు. ఇలా రోజుకు రెండుసార్లు తేనెను అప్లై చేశారంటే నోటిపూత  జామ చెట్టు లేత ఆకులను నమిలి ఆ రసాన్ని నోటిలో కొద్దిసేపు ఉంచుకుని పుకిలిస్తే నోటిపూత నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులు యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది.  తులసి ఆకులను రోజుకు రెండు సార్లు నమిలి మింగితే నోటి పూత తగ్గుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *