ఆవేశంతో ప్రియురాలిని చంపి తాను సూసైడ్ చేసుకున్న సింగర్.. ఇంతకూ ఏం జరిగిందంటే?

కొన్ని కొన్ని సార్లు ఆవేశం అనేది ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. ఆవేశంలో ఏ తప్పు చేసిన అది తప్పుగా కనిపించదు. అలా ఓ సింగర్ కూడా తను ఆవేశంగా తీసుకున్న నిర్ణయంతో తన ప్రియురాలిని చంపేశాడు. అంతేకాకుండా అతడు కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఇంతకూ అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన అమెరికన్ సింగర్ ర్యాపర్ జే స్టాష్. ఈయన తన పాప్ సంగీతంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ ఈయన తీసుకున్న ఆవేశ నిర్ణయం వల్ల అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొత్త సంవత్సరం రోజున ఆయన తన ప్రియురాలిని తమ మాస్టర్ బెడ్ రూం లోకి తీసుకెళ్లి లాక్ చేసి ఆమెను గన్నుతో పలుమార్లు షూట్ చేశాడు.

ఇక అతడు కూడా అదే గన్నుతో కాల్చుకొని అక్కడికక్కడే మరణించాడు. ఇక అతడి ప్రియురాలికి ముగ్గురు పిల్లలు ఉండగా.. వాళ్లంతా 11 ఏళ్ళ లోపు ఉన్నారు. గన్ శబ్దం రావడంతో వెంటనే వాళ్లు బెడ్ రూమ్ తలుపు తీయడానికి ప్రయత్నించారు. ఇక ఏమి చేయలేక తమ అమ్మమ్మకి, పోలీసులకు ఫోన్ చేసి చెప్పటంతో వారంతా అక్కడికి చేరుకొని మృతదేహాల్ని
పరిశీలించారు.

వీరి మరణానికి అసలు కారణం తెలియకపోగా.. ఈ ఘటనకు ముందు వారిద్దరి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలుపుతున్నారు. మొత్తానికి ఆ సింగర్ చేసిన పనితో ఆయన అభిమానులు ఎంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ విషయం గురించి లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *