పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే.. ఆ పవర్‌ చూశారా..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఇది ఆనందరకమైన విషయమనే చెప్పాలి. ఆయన కథానాయకుడిగా రూపొందుతోన్న లేటెస్ట్ సినిమా ‘హరి హర వీరమల్లు’ యూనిట్ రోజుకు ఒక కొత్త అప్‌డేట్‌తో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని స‌ర్‌ప్రైజ్‌ చేస్తోంది. రీసెంట్‌గా సినిమా యాక్ష‌న్‌ షెడ్యూల్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఫైట్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో కూడా విడుదల చేశారు. అందులో పవన్ విన్యాసాలు ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చాయి.

Pavan kalyan's New movie Hari hara veeramallu latest updates

హైదరాబాదులో వేసిన భారీ సెట్టింగుల నడుమ పవన్ కల్యాణ్‌పై గత కొన్నిరోజులుగా పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆయా సన్నివేశాలకు ముందు పవన్ ఏ విధంగా సాధన చేశారన్నది ఈ ప్రీ షూట్ వీడియోలో చూపించారు. ఇక ఇవాళ శ్రీరామ నవమి సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ సెట్‌లో పవన్‌ కల్యాణ్‌ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది. అలాగే హరి హర వీర మల్లు కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో పవన్ పదునైన చూపులతో.. చేతిలో ఈటెతో మరింత పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. దీంతో పవన్ కొత్త పోస్టర్ కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పవన్ ఫ్యాన్స్ లైకులు కామెంట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

అక్రమార్కులకు వ్యతిరేకంగా ఓ పోరాట యోధుడు ప్రదర్శించిన పరాక్రమం, నైపుణ్యాలను ఈ వీడియోలో చూడొచ్చని దర్శకుడు క్రిష్ పేర్కొన్నారు. ఏఎం రత్నం సమర్పణలో ఏ.దయాకర్ రావు నిర్మాతగా మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *