20 ఏళ్లుగా ఎన్టీఆర్‌కి పెద్ద అభిమానిని: స్టార్‌ డైరెక్టర్

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి రికార్డులెన్నో బద్దలు కొట్టిన చిత్రం ‘కేజీఎఫ్‌’. ఆ సినిమా చూసిన ఆడియన్స్‌ దానికి సీక్వెల్‌ ఎప్పుడెప్పుడూ వస్తుందా? అని వేయి కళ్లతో ఎదురుచూశారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడనుంది. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్‌ 14న ప్రపంచవ్యాప్తంగా ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇంతలా క్రేజ్‌ సంపాదించుకోవడానికి యశ్‌ యాక్టింగ్‌ ఒక కారణమైతే.. ఆ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ మరో ప్రధాన కారణం. ఈ ఒక్క సినిమాతో అటు యశ్‌, ఇటు ప్రశాంత్‌ నీల్‌ సూపర్‌ పాపులర్‌ అయ్యారు. దీంతో ప్రశాంత్ నీల్‌కు వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి.

Director Prashanth neel intresting comments on Jr NTR

ఇక ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్‌’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే కూడా ఎన్టీఆర్‌తో మరో సినిమా మొదలుపెట్టనున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా గురించి ఎన్టీఆర్ మాట్లాడారు. అక్టోబర్ 2022లో సినిమా స్టార్ట్ అవుతుందని.. ‘కేజీఎఫ్’ రేంజ్‌లో సినిమా ఉంటుందని ఎన్టీఆర్ చెప్పారు. ఎన్టీఆర్ నటించనున్న 31వ సినిమా ఇది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

తాజాగా ఈ సినిమా గురించి, ఎన్టీఆర్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ తో కలిసి జర్నీ చేయడంతో ఎంతో సంతోషంగా అనిపిస్తుందని.. రెండేళ్లుగా ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరిందని.. తనకు స్టోరీ బాగా నచ్చిందని.. ప్రస్తుతం దానిపై వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. ‘నేను గత 15, 20 ఏళ్లుగా ఎన్టీఆర్‌ అభిమానిని. మేము స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రారంభించాక 10 – 15 సార్లు కలిశాం. ఆయనకు స్క్రిప్ట్‌ నచ్చడంతో దానిపై పూర్తిగా వర్క్‌ చేస్తున్నాను. మేము గత రెండేళ్లుగా సన్నిహితులం. ఈ సినిమా గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను. దయచేసి అది ఏ జోనర్‌ అని నన్ను అడగొద్దు’ అని తెలిపాడు. ప్రస్తుతం కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *