వామ్మో ఇదెక్కడి వాదన.. మాస్క్ పెట్టుకొని తినాలాట.. ఫ్లైట్ లో ఒకటే రచ్చ!

ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్కు తప్పనిసరి అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక ప్రయాణం చేసే సమయంలో బస్సులలో, విమానాలలో, మెట్రో ట్రైన్స్ లో ఎవరైనా మాస్కు పెట్టుకోకపోతే మాస్కులు పెట్టుకోమని పక్క ప్రయాణికులు కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో పరిస్థితి ఈ విధంగా ఉంటే పక్క దేశాల్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మార్కుల విషయంలో పక్క దేశాలలో మనుషులు రెండు రకాలు గా మారారు. ఒకటి మాస్క్ ని సపోర్ట్ చేసేవాళ్ళు, రెండు సపోర్ట్ చేయని వాళ్ళు. మాస్క్ ని వ్యతిరేకించేవారు దాన్ని పెట్టుకోకుండా తోటి ప్రయాణికులతో వాదనలకు దిగుతున్నారు.

ఇప్పుడు మనం తెలుసుకోబోయే సంఘటన కూడా అలాంటిదే. ఒక మహిళ మాస్కు పెట్టుకోకుండా మరొక వ్యక్తితో మాస్కు పెట్టుకోవాలి అంటూ గొడవకు దిగింది. తాజాగా ఈ ఘటన డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో జరిగింది. విమానంలో 80 ఏళ్ల వృద్ధుడు తన సీట్ లో తాను కూర్చుని నెమ్మదిగా ఏదో తింటూ ఉన్నాడు. తింటున్నప్పుడు మాస్కు పెట్టుకోలేము కదా.. కానీ ఒక మహిళ మాత్రం అతని దగ్గరకు వచ్చి తింటున్నప్పుడు కూడా మాకు పెట్టుకోలేదని వాదనకు దిగింది. పోనీ ఆ వృద్ధుడి తో వాదిస్తున్న సదరు మహిళ మాస్క్ పెట్టుకుందా అంటే అదీ లేదు. ఆ వాదనతో విసిగిపోయిన ఆ ముసలాయన సదరు మహిళ పై సీరియస్ అవుతూ వెళ్ళవమ్మా అంటూ కారెన్ అనే పదాన్ని వాడాడు. ఒక రకమైన తిట్టు.

దీనితో ఆ మహిళకు ఎక్కడలేని కోపం రావడంతో ఆ పెద్దాయన పైకి విరుచుకుపడింది. సదరు ప్రయాణికులు కలుగజేసుకొని వెళ్లి మీ సీట్లో కూర్చొని అనే ఆమెకు చెప్పగా.. ఆమె మరింత రెచ్చిపోయి ఆ వృద్ధుడిని పిడిగుద్దులు గుద్దింది. గొడవ పెద్దది కావడంతో ఫ్లైట్ అటెండెంట్ ఎస్కార్ట్ లు కలుగజేసుకుని ఆవిడను అక్కడి నుంచి తీసుకుపోయారు. ఆ మహిళ పేరు ప్రతీసియా కార్న్ వాల్. విమానంలో అలా ప్రవర్తించినందుకు ఏర్పాటులో విమానం దిగగానే ఎఫ్బిఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేసినట్లు అట్లాంటా పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *