వామ్మో.. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కు రేంజ్ ఇలా ఉందా?

Second Hand Smartphone: మారుతున్న జీవన విధానం కారణంగా, ఆన్లైన్ క్లాసెస్ ప్రభావం వల్ల స్మార్ట్ ఫోన్స్ వినియోగం మరింత పెరిగింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. పొద్దస్తమానం స్మార్ట్ ఫోన్ తోనే బతికేస్తున్నారు. ఇక ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ల డిమాండ్ పెరిగిందని తెలుస్తుంది. ఇప్పుడు వాటి వివరాలు మనం తెలుసుకుందాం.

మన భారతదేశంలో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ వినియోగం మరో స్థాయిలో పెరిగిందట. ఈ విషయాన్ని ఐసీఈఏ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ సంస్థ వెల్లడించింది. వారి సమాచారం ప్రకారం కేవలం 2021లో 2.50కోట్ల సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఇక ఒక్కో మొబైల్ ధర 6900 గా ఉంటుందని సమాచారం.

ఇక మన దేశంలో కరోనా రాక ముందు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కు అంతగా డిమాండ్ లేదు. ఐసీఈఏ లెక్కల ప్రకారం కరోనా తర్వాతే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనుగోలు ఎక్కువ పెరిగినట్లు తెలుస్తుంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు సంబంధించి దాదాపు 90 శాతం ఫోన్ లు ఒకరి చేతి నుంచి మరొకరికి చేతికి మారుతున్నట్లు తెలుస్తుంది. 5% ఫోన్ లు మాత్రం రిపేర్ వస్తున్నాయని తెలిపింది.

నిజానికి నెలకు 30 వేల కంటే తక్కువ ఇన్ కమ్ ఉన్నవారే స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నట్లు తెలుస్తుంది. క్రమం తప్పకుండా కొత్త ఫీచర్లతో ఫోన్ మార్కెట్లోకి రావడంతో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ వినియోగం మరింత పెరిగింది. మరి మీరు కూడా.. వాటిపై ఓ లుక్ వేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *